డ్రైఫ్రూట్స్ జాబితాలో ఎండు ద్రాక్షది ముఖ్యస్థానం. వాడుక భాషలో కిస్మిస్ గా పిలిచే ఈ ఎండుద్రాక్ష ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందుబాటు ధర, సులువుగా జీర్ణం కావటం, ఆకట్టుకొనే రుచి వంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఎండు ద్రాక్ష ఆరోగ్య పరిరక్షణలో ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

 • ఎండుద్రాక్షలోని ఫినోలిక్ ఫైటో న్యూట్రియంట్లు క్రిములను చంపే జర్మిసైడ్స్ గా పనిచేసి పలు అనారోగ్యాల నివారణ, నియంత్రణకు దోహదం చేస్తాయి. ఎండుద్రాక్ష మంచి యాంటీ బయోటిక్ గా పనిచేసి జ్వరాలను త్వరగా తగ్గిస్తుంది. ఇందులోని ఫ్రక్టోజ్, గ్లూకోజ్ నీరసాన్ని తగ్గించి త్వరగా శక్తినిస్తాయి. అనారోగ్యం బారిన పడి, బరువు తగ్గినవారు ఎండుద్రాక్ష తింటే తక్కువ సమయంలో బరువు పెరుగుతారు.
 • ఎండుద్రాక్షలోని 'కెటాచిన్స్'(పాలీ ఫినాలిక్ యాంటీ ఆక్సిడెంట్స్) జీవక్రియలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ఆటకట్టించి క్యాన్సర్ వంటి హానికర రోగాల బారి నుంచి కాపాడుతాయి.
 • ఎండు ద్రాక్షలోని పొటాషియం అధిక రక్తపోటును అదుపు చేయటమే గాక కుచించుకుపోయిన రక్తనాళాలను తెరుచుకొనేలా చేసి రక్తప్రసరణను పెంచుతుంది. రోజూ 20 ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తింటే రక్తశుద్ధి జరగటమే గాక నరాలు బలం పుంజుకొంటాయి.
 • ఎండు ద్రాక్షలోని విటమిన్ ఏ, బీటాకెరోటిన్, కెరటినాయిడ్స్ కంటి పనితీరును పెంచి, నేత్ర సంబంధ వ్యాధులను దరిజేరనీయవు.
 • ఎండుద్రాక్షలోని 'ఒలెనిక్ ఆమ్లం' దంతాల్లోని హానికారక బ్యాక్టీరియా ను తొలగిస్తుంది.
 • ఎండుద్రాక్షలోని 'అర్జినిన్' అనే అమినో ఆమ్లం లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది. అందుకే దంపతులు రోజూ వీటిని తినాలి.
 • ఇందులో పుష్కలంగా ఉండే పీచు పదార్ధం మలబద్ధకాన్నినివారిస్తుంది. మలబద్ధక బాధితులు రాత్రి నిద్రకు ముందు 10 ఎండుద్రాక్ష, అరచెంచా సోంపు కలిపి తింటే సుఖవిరేచనం అవుతుంది. వేడి నీటిలో ఎండుద్రాక్ష ముక్కలు వేసి నానిన తర్వాత ఆ నీటిని చిన్నారులకు పట్టిస్తే వారి జీర్ణశక్తి పెరుగుతుంది.
 • ఎండుద్రాక్షలోని బీ కాంప్లెక్స్, కాపర్, ఐరన్ రక్తహీనతను దరిజేరనీయవు. అండాశయ సమస్యలున్న మహిళలు తింటే సమస్య దూరమై సంతానం కలుగుతుంది. రోజూ ఎండుద్రాక్ష తినే మహిళల మూత్రంలో అమ్మోనియా స్థాయిలు అదుపులో ఉండి మూత్రనాళంలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తవు.
 • పక్కతడిపే పిల్లలకు వారం పాటు రాత్రి పడుకోబోయే ముందు ఎండుద్రాక్ష తినిపిస్తే ఆ అలవాటు మాయమవుతుంది. అయితే ఆ సమయంలో వారికి మజ్జిగ, పెరుగు వంటివి ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి.
 • శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించటం, గొంతు మంట, నొప్పి తదితర సమస్యలను ఎండుద్రాక్ష వినియోగంతో నివారించవచ్చు.
 • ఎండు ద్రాక్షలోని క్యాల్షియం, బోరాన్ మూలంగా ఎముకలు బలోపేతమవుతాయి. అందుకే ఎదిగే వయసు పిల్లలు, వృద్దులు రోజూ ఎండుద్రాక్ష తినాలి.
 • ఎండు ద్రాక్షలోని ఐరన్ వల్ల మాడు భాగానికి రక్తప్రసారం మెరుగుపడి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చర్మం కోమలంగా మారేందుకూ ఎండు ద్రాక్ష వినియోగం దోహదం చేస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE