బీట్‌రూట్ను చాలామంది సలాడ్స్, వేపుడుకు మాత్రమే పరిమితం చేస్తారు గానీ నిజానికి దీంతో ఎన్నో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. అలాంటివాటిలో బీట్‌రూట్ హల్వా ఒకటి. రుచిలో క్యారెట్ హల్వాకు ఏమాత్రం తీసిపోని ఈ వంటకం ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసినవి

బీట్‌రూట్ దుంపలు - 2, చక్కెర - 2 కప్పులు, యాలకుల పొడి - చెంచా, నెయ్యి - అర కప్పు, కిస్‌మిస్‌, జీడి పప్పులు - 10 చొప్పున 

తయారీ

ముందుగా బీట్‌రూట్ లను  కడిగి తొక్క తీసి తురుముకోవాలి. తర్వాత మందపాటి గిన్నెలో అరకప్పు నెయ్యి వేసి వేడి చేసి అందులో బీట్‌రూట్ తురుము వేసి సన్నని సెగమీద వేయించుకోవాలి. ఈ లోపు మరో గిన్నెలో చెంచా నెయ్యి వేసి కిస్‌మిస్‌లు, జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేగుతున్న తురుము పచ్చివాసన పోయాక అందులో యాలకుల పొడి, చక్కెర వేసి కలిపి మరో 15 నిమిషాలు తక్కువ సెగమీద వేయించాలి. మగ్గిన తురుముకు చక్కెర బాగా పట్టిన తర్వాత దించి నెయ్యి రాసిన పళ్లెంలో వేసుకొని చేతితో సమానంగా ఒత్తి పైన నేతిలో వేయించిన కిస్‌మిస్‌లు, జీడిపప్పులు చల్లుకొని కోరిన ఆకారంలో కట్ చేసుకొంటే రుచికరమైన బీట్‌రూట్ హల్వా రెడీ అయినట్లే. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE