ఈ ఏడాదికి వేసవి వచ్చేసినట్లే. వేసవి వస్తూ వస్తూ ఎండలతోబాటు పుల్లని మామిడి కాయలనూ తెచ్చేసింది. ఈ సీజన్లో కమ్మని రుచితో బాటు మేలైన ఆరోగ్యాన్నిచ్చే పుల్ల మామిడితో అప్పటికప్పుడు చేసుకొనే ముక్కల పచ్చడి తయారీ ఎలాగో తెలుసుకొని ఈ రోజే ఆ రుచిని ఆస్వాదిద్దాం. 

కావలసినవి 

గట్టి పుల్లని ఓ మాదిరి సైజు మామిడికాయ-1, కారం- 2 గరిటెలు, ఉప్పు-రుచికి తగినంత, వెల్లుల్లి రెబ్బలు- 4, కరివేపాకు- 1 రెమ్మ, నూనె- 2 గరిటెలు, ఎండుమిర్చి-2, తాలింపుగింజలు - చెంచా.      

చేసేపద్ధతి 

ముందుగా మామిడికాయను కడిగి తుడిచి చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత కారం,ఉప్పు,వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి అందులో గుప్పెడు కోసిన మామిడి ముక్కలు వేసి మరోతిప్పు తిప్పాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన మామిడి ముక్కలు కూడా కలుపుకోవాలి. కావాలనుకొంటే ఇందులో చిటికెడు ఆవపిండి,మెంతి పిండి కూడా వేసి కలుపుకోవచ్చు. ఈ పచ్చడిని తాలింపు వేసేస్తే మామిడి ముక్కల పచ్చడి రెడీ అయినట్లే. వేడివేడి అన్నంలో రవ్వంత నెయ్యి వేసుకొని దీన్ని కలుపుకొని తింటే ఆ రుచి చాలా బాగుంటుంది.  



Recent Stories







bpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE