దక్షిణాది అల్పాహారాల్లో ఇడ్లీది మొదటి స్థానం. నూనె అవసరం లేని, తేలికగా జీర్ణమయ్యే మేలైన పోషకాలుగల అల్పాహారం ఇడ్లీ. ప్రపంచంలోని మొదటి 10 అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటి ఇడ్లీ. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారుచేస్తారు. వీటిలో కంచిప్రాంతంలో చేసే ఇడ్లీకి చాలా పేరు. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసినవి

ముడిబియ్యం, ఇడ్లీ బియ్యం, మినప్పప్పు-1 కప్పు చొప్పున , మిరియాలపొడి- 2 చెంచాలు, జీలకర్ర, శొంఠిపొడి- ఒక్కో చెంచా చొప్పున తాలింపుకోసం- 5 చెంచాల నువ్వులనూనె, 2 చెంచాల మినప్పప్పు, 1 చెంచా ఆవాలు, 2 రెబ్బల కరివేపాకు, 10 జీడిపప్పు, పావు చెంచా ఇంగువ, ఉప్పు- రుచికి తగినంత,

తయారీ

రెండు రకాల బియ్యం ఒక గిన్నెలో, మినప్పప్పును మరోగిన్నెలో పోసి 3 గంటలపాటు నానబెట్టాలి. ఇప్పుడు ముందుగా మినప్పప్పు రుబ్బాలి. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కూడా మెత్తగా రుబ్బి మినప్పిండిలో వేసి, తగినంత ఉప్పు వేసి కలిపి సుమారు 6 గంటలపాటు పులియనివ్వాలి. మర్నాడు ఉదయం ఇడ్లీ వేసే 1 గంట ముందు ఆ పిండిలో శొంఠిపొడి, మిరియాలపొడి, జీలకర్ర వేసి కలపాలి. ఇప్పుడు చిన్న బాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, జీడిపప్పు, ఇంగువ, మినప్పప్పు వేసి వేయించి దాన్ని ఇడ్లీ పిండిలో కలపాలి. ఈ గంటె జారుడు ఇడ్లీ పిండిని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్స్ లో వేసి ఆవిరిమీద 20 నిమిషాల పాటు ఉడికించి తీసి, కొబ్బరి, వేరుశెనగచట్నీ, నెయ్యితో తో వేడి వేడిగా ఆరగించాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE