రొటీన్ కి భిన్నమైన వంటకం చేద్దామనుకొనేవారికి ఇదో మంచి ఎంపిక. మంచి రుచితో బాటు ఎన్నో పోషకాలను అందించే ఈ పుట్టగొడుగుల వంటకం ఈ రోజే ట్రై చేసి చూద్దాం. 

కావలసినవి

బటన్ మష్రూమ్స్- అరకేజీ,  క్యాప్సికమ్ - 200 గ్రాములు, ఉల్లి తరుగు - కప్పు , అల్లం - 50 గ్రా, వెల్లుల్లి  - 6 రెబ్బలు, నూనె - 5 చెంచాలు, కారంపొడి- చెంచా,  డార్క్ సోయాసాస్ - 2 చెంచాలు, వెనిగర్ - 2 చెంచాలు

మొక్కజొన్నపిండి- చెంచా, నీళ్లు - కప్పు 

తయారీ

 ముందుగా మష్రూమ్స్‌ను కడిగి, ఒక్కోదాన్నిరెండుగా కోసుకోవాలి. అలాగే క్యాప్సికమ్‌లను సగానికి కోసి లోపలి గింజలు తీసి నిలువునా కోసిపెట్టుకోవటంతో బాటు ఉల్లితరుగు, అల్లం, వెల్లుల్లిలను ముద్దగా నూరుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో 5 చెంచాల నూనె వేడిచేసి, అందులో ఉల్లితరుగు, అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి కలిపి పచ్చివాసన పోయేవరకు వేయించి అందులో కారంపొడి చల్లి, పావుకప్పు నీళ్లు పోసి కలిపి మిశ్రమం గట్టిపడే వరకు సన్నని సెగమీద 10 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. ఆ తరువాత ఇందులో క్యాప్సికమ్, మష్రూమ్ ముక్కల్ని వేసి తగినంత ఉప్పు చల్లి కలిపి మూతపెట్టి సిమ్‌లో పూర్తిగా మగ్గే వరకు ఉంచి బ్లాక్ సోయాసాస్, వెనిగర్‌లను వేసి, కార్న్‌ఫ్లోర్‌ కలిపిన పావుకప్పు నీళ్లు కూరలో పోసి కలపాలి. దీన్ని 2 నిమిషాలు ఉడికిస్తే చిల్లీ మష్రూమ్ రెడీ అయినట్లే. దీన్ని వేడివేడి వెజిటబుల్ రైస్ లేదా నూడుల్స్‌తో కలిపి తింటే ఆహా అనిపించాల్సిందే.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE