ఎండాకాలం అనగానే మండే ఎండలతో బాటు లేలేత తాటిముంజెలూ గుర్తుకొస్తాయి. ఆకట్టుకొనే వాసనతో, రుచికి తీయగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా, పట్టుకుంటే జారిపోయే తాటిముంజలు వేసవి తాపాన్ని తగ్గించటమే గాక బోలెడన్ని పోషకాలనందిస్తాయి. ఖరీదైన ఎనర్జీ డ్రింకులు, కూల్ డ్రింక్స్ తో పోల్చితే నామమాత్రపు ధరకు లభించే ఈ తాటిముంజలు ఆరోగ్యానికి ఎంత మేలుచేస్తాయో పోషకాహార నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. 

పోషకాల వివరాలు

  • తాటిముంజల్ని ఆంగ్లంలో ‘ఐస్ యాపిల్’ అంటారు. వీటిలో 87శాతం ఉండే నీరు దాహార్తిని తీర్చి శరీరాన్ని చల్లబరచటమే గాక చెమట ద్వారా కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేస్తుంది.
  • ముంజల్లో 'విటమిన్ ఎ' పుష్కలంగా లభిస్తుంది. వీటితో బాటు థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్‌ సి లు ఉంటాయి.
  • వీటిలోని జింక్, పొటాషియం,క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజలవణాలు శరీరబరువును తగ్గించటమే గాక నొప్పులను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లుంటాయి.
  • తక్కువ క్యాలరీలు, ఎక్కువ శక్తిని అందించటం తాటిముంజల ప్రత్యేకత. పైగా సులభంగా జీర్ణమవుంటాయి గనుక అన్ని వయసులవారూ నిరభ్యంతరంగా తినొచ్చు. 100 గ్రాముల ముంజెల్లో కేవలం 43 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. 3 తాటిముంజెలు తింటే ఒక కొబ్బరి బోండాం తాగినట్టే.

ఉపయోగాలు

  • ఆటలమ్మ వంటి అంటువ్యాధుల వల్ల ఏర్పడ్డ మచ్చలకు తాటిముంజెల నీటిని రాస్తే దురద తగ్గటమే గాక ఆ బొబ్బలు మాడిపోతాయి. ఎండాకాలంలో వచ్చే వేడి పొక్కులు, మొటిమలు తొలగిపోతాయి.
  • మలబద్ధకం, ఎసిడిటీ బాధిత గర్భిణులు తాటిముంజలు తింటే ఆ ఇబ్బందులు దూరమవుతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.
  • కాలేయ సమస్యలున్నవారు తాటిముంజలు తింటే కాలేయ శుద్ధి జరిగి దాని పనితీరు మెరుగు పడుతుంది.
  • తాటిముంజల్లోని పొటాషియం శరీరంలోని హానికారక వ్యర్ధాలను సమర్ధవంతంగా తొలగిస్తుంది.
  • వేసవిలో ఎండ కారణంగా అయ్యే వాంతులకు తాటి ముంజలు మంచి విరుగుడుగా పనిచేస్తాయి.
  • కణితులు, బ్రెస్ట్ క్యాన్సర్ కారక ఫైటోకెమికల్స్, ఆంథోసైనిన్ ల నివారణకు ముంజల్లోని కొన్ని పోషకాలు దోహదపడతాయి. 

గమనిక : తాటిముంజల్లోని పోషకాలను పూర్తిగా అందిపుచ్చుకోవాలంటే వాటిపై పొట్టు తీయకుండా తినాల్సిందే.  Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE