వేసవిలో ఒక్కసారైనా పచ్చి మామిడిపప్పుచారు రుచి చూడాల్సిందే. తగినన్ని పోషకాలతో బాటు మంచి వాసన, కమ్మని రుచితో ఆకట్టుకొనే ఈ పప్పుచారు ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసినవి

మీడియం సైజు మామిడికాయ - 1, కందిపప్పు - 1 కప్పు, ఉల్లిపాయ - 1, టొమాటో - 1, పచ్చిమిర్చి - 4, ఎండుమిర్చి - 3, ఆవాలు, జీలకర్ర - పావు చెంచా, పసుపు- పావు చెంచా, వెల్లుల్లి - 5 రెబ్బలు (ఓ మాదిరిగా దంచాలి), ధనియాలపొడి - అరచెంచా, కరివేపాకు - 2 రెమ్మలు, కారం - అర చెంచా, కొత్తిమీర తరుగు - చెంచా, నూనె - 5 చెంచాలు, ఉప్పు - రుచికి తగినంత

తయారి

 మామిడికాయను కడిగి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించి చల్లారనివ్వాలి. అలాగే.. కందిపప్పులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించి, బాగా మెదిపి 2 గ్లాసు నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి ఓ మాదిరి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. తర్వాత మందపాటి గిన్నెలో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఉల్లిపాయలు, కరివేపాకు, టొమాటో ముక్కలు, ఒకదాని తర్వాత ఒకటి వేసి మగ్గనివ్వాలి. ఈలోగా.. ఉడికిన మామిడికాయను పిండి రసం తీసి, పప్పులో పోసి కలిపి దీన్ని ఉడుకుతున్నముక్కల్లో పోసి ఉప్పు, కారం కలిపి మూతపెట్టి బాగా మరగనివ్వాలి. చివరగా ధనియాలపొడి, కొత్తిమీర వేసి మరిగిన తర్వాత దించుకోవాలి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE