సులభంగా, వేగంగా చేసుకొనే వంటకాల్లో పాలక్ రైస్ ఒకటి. మంచి రుచి, బోలెడన్ని పోషకాలనందించే ఈ వంటకాన్ని అల్పాహారం, మధ్యాహ్న భోజనం లేదా డిన్నర్ లో తీసుకోవచ్చు. ఇంట్లో పాలక్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసినవి

బాస్మతి బియ్యం - పావుకిలో, పాలక్ ప్యూరీ (ఉడికించి, చల్లార్చి గ్రైండ్ చేసిన పాలకూర) - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (నిలువుగా కోసుకోవాలి), క్యారెట్ - 1 ( చిన్నముక్కలుగా కోసుకోవాలి), పచ్చి బఠానీ గింజలు - గుప్పెడు, పచ్చిమిర్చి - 3 (ముక్కలు), మిరియాల పొడి - అరచెంచా, సోయాసాస్ - అర గరిటె, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 3 చెంచాలు. 

తయారీ

ముందుగా మందపాటి గిన్నెలో నూనె వేసి కొద్దిగా వేడి కాగానే ఉల్లి, క్యారట్, పచ్చిమిర్చి తరుగు, బఠానీలు... ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగనివ్వాలి. ఈ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పాలక్ ప్యూరీ, ఉప్పు, మిరియాలపొడి, సోయాసాస్ వేసి కలిపి మూతపెట్టి 3 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి ఎసరు మరుగుతుండగా కడిగిపెట్టుకొన్న బియ్యం పోసి సన్నని సెగమీద మూతపెట్టి ఉడికించాలి. అన్నం తగినంత ఉడికిన వెంటనే గరిటెతో ఒకసారి బాగా కలిపి మూతపెట్టి మరో 2 నిమిషాలుంచి దించి రైతాతో వేడి వేడిగా వడ్డించాలి. కొందరు అన్నం ముందే వండి పెట్టుకొని, నీళ్లు పోయకుండా ఉడికిన పాలక్ ప్యూరీ మిశ్రమంలో వేసి కలిపి కూడా పాలక్ రైస్‌ చేసుకుంటారు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE