హోలీ అనగానే రంగులతో బాటు పూరన్ పోలీ గుర్తొస్తుంది. హోలీ రోజు ఎన్ని వంటకాలున్నా ముందుగా దీన్నే రుచిచూస్తారు. చూసేందుకు ఇది మన బొబ్బట్టును మాదిరిగా ఉంటుంది. కాకుంటే మనం చేసే తీరులో మాత్రం కొద్దిగా తేడా ఉంది. ఈ హోలీ పండుగ నాడు మనమూ ఈ వంటకాన్ని చేసి అతిథుల నోరు తీపి చేద్దాం.   

కావలసినవి

మినప్పప్పు       - 300 గ్రాములు

బెల్లం              - 300 గ్రాములు

బియ్యం పిండి    - 150 గ్రాములు

నెయ్యి              - 3 గరిటెలు ( పిండిలో కలిపేందుకు 1 గరిటె, కాల్చేందుకు 2 గరిటెలు)  

తయారి

ముందుగా మినపప్పును నానబెట్టి మెత్తగా ఉడికించుకుని ఆరబోసి తర్వాత  మెత్తని పొడిలా మిక్సీ పట్టాలి. ఈ పిండిలో బెల్లం తరుగు వేసి కొద్దిగా నీరు పోసి కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దీ కొద్దిగా బియ్యం పిండిని, నెయ్యి వేసి చపాతీ పిండిలా కలుపుకొని 15 నిమిషాలు  పక్కనబెట్టాలి. తర్వాత కొద్దీ కొద్దిగా పిండి తీసుకొని పూరీల్లా ఒత్తుకొని 5 నిమిషాలు పేపర్ మీద పెట్టాలి. తర్వాత  పాన్‌ను వేడిచేసి కొద్దిగా నెయ్యి వేసి ఒక్కో పూరీని దోరగా వేయించాలి. పెనంపై వేశాక గరిటెతో అదుముతూ రెండు వైపులా తిప్పుతూ కాలిస్తే.. లోపలి పూర్ణం కూడా బాగా వేగుతాయి. వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.



Recent Stories







bpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE