వంటకాలకు కమ్మని సువాసనను తెచ్చే యాలకులు ఆరోగ్య పరిరక్షణలోనూ ఎంతగానో దోహదపడతాయి. తరచూ యాలకులు తినేవారికి అనారోగ్యాల బెడద తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి యాలకులు ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసుకొందాం. 

  • యాలకుల వినియోగంతో అధిక రక్తపోటు త్వరగా అదుపులోకి వస్తుంది.
  • ఆస్తమా కారక జలుబు, దగ్గు ఉన్నవారు యాలకులు నమిలి చప్పరిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది.
  • వికారం, కడుపుబ్బరం, ఆకలి లేకపోవటం వంటి ఇబ్బందులకు యాలకులు ఔషధంగా పనిచేస్తాయి.
  • రోజూ 2 యాలకులు తింటే శరీరంలోని చేరిన హానికారక వ్యర్థాలు వదిలిపోతాయి.
  • యాలకుల వినియోగంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అందుకే భోజనం తరవాత యాలకులకు కొద్దిగా సోంపు, ధనియాలు కలిపి తీసుకుంటారు. అసిడిటీ సమస్య ఉన్నా తగ్గుతుంది.
  • యాలకుల్లోని పొటాషియం, మెగ్నీషియం గుండెకు మేలు చేస్తాయి. రోజుకో కప్పు యాలకుల టీ తాగితే హృదయారోగ్యానికి మంచిది. బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు యాలకుల టీ తాగితే మెదడుకు ప్రాణవాయు సరఫరా పెరిగి తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి సైతం దూరమవుతుంది.
  • యాలకులు మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేసి నోటి దుర్వాసనను అరికడతాయి. నోటిలోని బ్యాక్టీరియాను సైతం నశింపజేస్తాయి.
  • యాలకుల వినియోగం రోగనిరోధక శక్తి పెంపుదలకు, కేన్సర్‌ కారకాల నిరోధానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE