ఈఏడాది ఆరంభం నుంచే ఎండలు ఎండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. ఈ ఇబ్బందికర పరిస్థితిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్లరసాల వినియోగం తప్పదనీ, అప్పుడే వేసవి తాపాన్నితట్టుకోవటం సాధ్యమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో లభించే నిల్వ ఉండే ఇన్‌స్టెంట్‌ కూల్‌డ్రింక్స్‌ను బదులుగా తాజా పండ్లరసాలే ఆరోగ్యానికి దోహదం చేస్తాయని వారి సూచిస్తున్నారు. ఈ క్రమంలో నిపుణులు సూచించే కొన్ని పండ్లరసాల వివరాలు మీకోసం..

  • ఒక ఆపిల్‌ను తొక్క తీయకుండా కోసి, గింజలు తీసి చిన్న ముక్కలు చేసి మిక్సీ జూసర్ లో వేసి తిప్పి, అందులో అరగ్లాసు చల్లని పాలు, చెంచా పటికబెల్లం పొడివేసి 10 నిమిషాలు ఫ్రిజ్లో పెట్టి తీసి తాగితే ఒంటికి చలువ చేయటమే గాక ఆపిల్‌లోని ఐరన్, భాస్వరం వంటి ఖనిజలవణాలతో బాటు బోలెడన్ని ప్రొటీన్లు అందుతాయి. ఈ పండులోని విటమిన్ ఏ వల్ల చర్మం కాంతివంతమవటమే గాక కంటిచూపు మెరుగు పడుతుంది.
  • కమలాపండులో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం విరివిగా లభిస్తాయి. అందుకే వేసవిలో రోజుకో గ్లాసు కమలారసం తాగితే తగినంత శక్తి లభించటమే గాక రక్తప్రసరణ మెరుగు పడుతుంది.
  • వేసవిలో నీరు అధికంగా ఉండే పుచ్చకాయను ఎంత తింటే అంత మంచిది. అలాగే.. పుచ్చకాయ రసంలో కొద్దిగా పటికబెల్లం కలిపి మధ్యాహ్నం వేళ తాగితే దాహం తగ్గడమే కాకుండా చలువజేస్తుంది. వేసవిలో గుండెలో మంటగా ఉన్నప్పుడు గుప్పెడు పుచ్చగింజలు రాత్రి నానబెట్టి ఉదయాన్నే వాటిని రుబ్బి నీరుకలిపి వడగట్టి దాంట్లో పటికబెలం పొడిని వేసి తాగితే సమస్య దారికొస్తుంది.
  • వేసవిలో ఎక్కువగా వాడాల్సిన ఫలాల్లో పైనాపిల్ ఒకటి. ఇందులోని సహజ చక్కెరల వల్ల పైనాపిల్ రసం తాగిన వెంటనే నీరసం తగ్గుతుంది.
  • వేసవిలో నిమ్మరసం ఎంత తాగితే అంత మంచిది. ముఖ్యంగా ఎండవేళ పల్చటి మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు వేసుకొని తాగితే వేడి తగ్గుతుంది.ఇందులోని విటమిన్ సి వల్ల రక్తశుద్ధి జరగటమే గాక చర్మ సౌందర్యమూ మెరుగుపడుతుంది.
  • విటమిన్ ఏ అధికంగా ఉండే పండ్లలో ఒకటైన బొప్పాయిలో ఐరన్ కూడా చెప్పుకోదగ్గ పరిమాణంలో ఉంటుంది. ఈ పండురసం తాగితే రక్తహీనత వదిలిపోవటంతో కిడ్నీరాళ్లు సైతం కరిగిపోతాయి. బొప్పాయిముక్కలు కోసి కొద్దిగా పాలు, చక్కెర, కొద్దిగా కలిపి తిప్పి అప్పటికప్పుడు తాగొచ్చు.
  • వేసవిలో రోజూ పండిన అరటిపండ్ల రసం తాగితే శరీరం చల్లబడుతుంది. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE