పోషకాలపరంగా అత్యంత ఉత్తమమైన పండ్లలో అనాస ఒకటి. ఆంగ్లంలో దీన్నే పైనాపిల్ అంటారు. చూపులకు ఆకట్టుకొనేలా ఉండకపోవటం, సులభంగా కోసి తినే వెసులుబాటు లేని కారణం, పెద్దగా సాగులో లేకపోవటం వల్ల ఇతర పండ్లతో పోల్చినప్పుడు దీని వినియోగం కాస్త తక్కువే. అయితే దీని పోషక గుణాల గురించి తెలుసుకున్నవారు  మాత్రం దీన్ని ఇష్టపడకమానరు. మరి ఆ వివరాలేమిటో తెలుసుకుందాం. 

 • అనాసలోని 'బ్రొమిలైన్‌' అనే ఎంజైమ్‌ ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తుంది గనుక అజీర్తి బాధితులకు ఇది ఔషధంవంటిది. ఈ ఎంజైమ్ కు వాపు, నొప్పులు తగ్గించే స్వభావం ఉన్నందున సైనసైటిస్‌, కీళ్లనొప్పులు, పంటి నొప్పులకు సైతం ఇది ఔషధంగా పనిచేస్తుంది.  దగ్గు, జలుబు, గొంతునొప్పి, బ్రాంకైటిస్‌ వంటి సమస్యలకు కూడా ఈ ఎంజైమ్ విరుగుడుగా పనిచేస్తుంది.
 • అనాసలోని రసాయనాలు కీళ్ళవాతం వల్ల దెబ్బతిన్న కణజాలాన్ని కోలుకునేలా చేస్తాయి. మధుమేహపు గాయాలను సైతం ఇవి తగ్గిస్తాయి.
 • తరచూ అనాస తింటే కిడ్నీలో పేరుకుపోయిన వ్యర్ధాలు, కడుపులో చేరిన నులిపురుగులు తొలగిపోతాయి.
 • హృద్రోగ బాధితులు రోజూ 2 అనాస ముక్కలు తింటే రక్తం పలుచబడి రక్తనాళాల్లో సులభంగా ప్రసరిస్తుంది. రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులు సైతం కరుగుతాయి.
 • రక్తహీనత బాధితులు రోజూ అనాస తింటే సమస్య తొలగిపోతుంది.
 • ఈ పండుకు కంటి కండరాల క్షీణతను, మతిమరపు, డిప్రెషన్‌లను తగ్గించే శక్తి ఉంది గనుక వృద్ధులకు ఎంతగానో మేలు చేస్తుంది.
 • అనాసలో పుష్కలంగా లభించే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచటమే గాక బ్యాక్టీరియాతో పోరాడి చిగుళ్ల సమస్యను నివారిస్తుంది.
 • అనాసలోని రసాయనాలకు కేన్సర్‌ కణాలను కట్టడి చేసే శక్తి ఉంది. వృద్ధులు, ఎదిగే వయసు పిల్లలు అనాస తింటే ఎముకలు బలపడతాయి.
 • అనాసలో పొటాషియం పాళ్ళు ఎక్కువ గనుక అధిక రక్తపోటుకు ఇది దివ్యమైన ఔషధం.
 • అనాసలో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సంతాన సాఫల్యానికి తోడ్పడతాయి.
 • పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారికి అనాస పండు దివ్యమైన ఔషధం.

పండినదే శ్రేష్టం

అనాసను పండిన తర్వాత తింటేనే పోషకాలు పూర్తిగా అందుతాయి. పండిన ప్రతి 100 గ్రాముల అనాసలో  87.8 గ్రాముల నీరు, 0.4 గ్రా ప్రొటీన్ , 0.1 గ్రా కొవ్వు, 10.8 గ్రా పిండి పదార్థం , 20 మి.గ్రా కాల్షియం, 9 మి. గ్రాముల భాస్వరం, 2.4 మి. గ్రాముల  ఐరన్ వంటి వాటితో బాటు 46 కిలోక్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పండు చెట్టుమీదే పండాలి తప్పమామిడి మాదిరిగా పచ్చిగా ఉండగా కోస్తే ఉపయోగం ఉండదు. పండిన అనాస పై ఉండే ముళ్లవంటి భాగాలు చేతితో లాగితే రావటమే గాక  ఆ పండు కమ్మని వాసన వస్తుంది. అలాగే.. పండుపై కుచ్చులా ఉండే ఆకులు పసుపు రంగులోకి మారినా లేదా పండుమీది చక్రాలవంటి పొట్టు ముదురురంగుకు మారినా ఆ పండు పాడయినట్లు గుర్తించాలి. అనాస గది ఉష్ణోగ్రతలో 2 రోజులు మించి ఉంటే కుళ్లిపోతుంది. కాబట్టి కొన్న వెంటనే తినటం మంచిది. ఈ పండును అరటి పండ్ల మాదిరిగా  ఫ్రిజ్‌లో గాక బయటే పెట్టాలి. పై తొక్కుతీసిన వెంటనే గాలి చొరని డబ్బా లేదా ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఇది పాడుకాకుండా 4 రోజులుంటుంది. 

గమనిక: రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే దీని స్వభావం వల్ల హీమోఫీలియా, కాలేయ వ్యాధులతో బాధపడేవాళ్లు మాత్రం దీన్ని తినకపోవడమే మంచిది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE