శ్రీరామ నవమి నాడు ఇంటిలో, ఆలయాల్లో వడపప్పు, పానకాలను స్వామికి నివేదించి భక్తులకు పంచిపెడతారు. ఈ ఆచారం వెనుక ఆరోగ్యపరమైన కారణాలున్నాయి. ఆ మాటకొస్తే.. పండుగల సందర్భంగా తయారు చేసే ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, దేహారోగ్యాన్ని కాపాడేలా నిర్ణయించినవే. వసంతఋతువులో వచ్చే శ్రీరామనవమి పండుగ సమయానికి ఎండలు మండిపోతూవుంటాయి. ఈ ఎండల్లో తీసుకొనే ప్రసాదం ఉక్కపోత, వడగాలి నుంచి ఉపశమనాన్ని కలిగించేదిగా ఉండాలి. పెసరపప్పు ఒంట్లోని ఉష్ణాన్ని తగ్గించటమే గాక జీర్ణశక్తిని కూడా వృద్ధిచేస్తుంది. అలాగే.. ‘వడ’ కొట్టకుండా కాపాడుతుంది గనుకే వడపప్పును ప్రసాదంగా నిర్ణయించటం జరిగింది.

పానకంలో కూడా ఈ లక్షణాలున్నాయి. ఇందులోని బెల్లం, మిరియాల పొడి, యాలకుల పొడి ఎండ వేడి నుంచి రక్షణ నివ్వటంతో బాటు రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతాయి. ఇక.. ఈ రెంటిలోనూ ఉమ్మడిగా ఉండే ఉప్పు మూలంగా చెమట రూపంలో శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేసుకొన్నట్లు అవుతుంది. పైగా ఈ రెండు పదార్థాలు ఎంతటి ఎండ కాసినా ఒక రోజు మొత్తం పాడుకాకుండా ఉంటాయి. వసంత రుతువులో వచ్చే గొంతువ్యాధులకు పానకంలో వాడే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ నవమినాడు రామయ్యకు నివేదించిన వడపప్పు, పానకాన్ని స్వీకరించి ఆయన ఆశీస్సులతో బాటు చక్కని ఆరోగ్యాన్నీ సొంతం చేసుకొందాం.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE