ఉగాది అనగానే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచుల సమ్మేళనమైన ఈ పచ్చడికి  మారుతున్న వేసవి వాతావరణాన్ని తట్టుకునే శక్తిని అందించటంతో బాటు శీతాకాలపు వాతావరణానికి మందగించిన జీర్ణశక్తి ని పెంచే గుణం ఉంది. అద్భుతమైన రుచి, అతి తక్కువ కేలరీలు  దీని ప్రత్యేకత. కనుక అందరూ దీనిని తీసుకోవచ్చు.

కావలసిన పదార్ధాలు

బెల్లం తరుగు -150 గ్రాములు, తాజా వేప పువ్వు -2 చెంచాలు, ఉప్పు- తగినంత, పచ్చిమిరపకాయలు- 2, పచ్చి మామిడి -1, కొత్త చింతపండు – నిమ్మకాయంత

చేసే పద్దతి

ఒక గిన్నెలో అరగ్లాసు నీళ్ళు పోసి బెల్లం తరుగు వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులో వేప పువ్వు , చింతపండు గుజ్జు, వేప పువ్వు, ఉప్పు, సన్నగా తరిగిన పచ్చి మిరప ముక్కలు, మామిడి కోరు వేసి బాగా కలిపితే ఉగాది పచ్చడి రెడీ అయినట్లే. కొందరు ఇందులో చిన్న చిన్న చెరుకు ముక్కలు, పండిన అరటిపండు ముక్కలు కూడా కలుపుకుంటారు. మిరపకాయలకు బదులుగా మిరియాల పొడినీ వాడతారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE