వేసవి అంటేనే పచ్చళ్లు పట్టే సీజన్. వేసవిలో పట్టే పచ్చళ్లలో ఆవకాయ తరువాత అంతరుచిగా ఉండేది మాగాయే. అవకాయతో పోల్చితే దీన్ని సులభంగా చేసుకోవచ్చు. పైగా.. ఈ పచ్చడికి ఆవకాయ మాదిరిగా ఫలానా రకం కాయే కావాలని లేదు. కాస్త పుల్లగా ఉండే ఏ మామిడికాయలైనా సరిపోతాయి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చెయ్యాలో చూద్దాం. 

కావలసినవి:

పుల్ల మామిడికాయలు-6,  పసుపు- చెంచా, మెంతులు- పావుకప్పు, ఆవాలు- గుప్పెడు (పిండి పట్టించాలి), నూనె-1 కప్పు, కారం- 1 కప్పు, రాతి ఉప్పు- 1 కప్పు 

చేసే పద్దతి

ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి చెక్కు తీసి సన్నని పొడవాటి ముక్కలు(వాలికలు)గా కోయాలి. ఈ ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి కలిపి ఓ జాడీ పెట్టి 3 రోజుల తరవాత ఈ ముక్కలను గుప్పెడు చొప్పున తీసి చేత్తో గట్టిగా పిండి , ఆ ముక్కలు, మిగిలిన రసం విడివిడిగా మంచి ఎండలో పెట్టాలి. రసం ఒక రోజుపాటు, ముక్కలు రెండు రోజులు ఎండలో పెట్టి తియ్యాలి. తర్వాత మూకుడులో మెంతులు వేసి దోరగా వేయించి చల్లారిన తరవాత పిండిపట్టాలి. ఇప్పుడు స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి కాచి దించి, సగం చల్లారాక  అందులో కారం, ఇంగువ వేసి కలపాలి. పూర్తిగా చల్లారాక మామిడిరసం వేసి కలపాలి. చివరగా మామిడి ముక్కలు కూడా వేసి బాగా కలిపి జాడీలో పెట్టి మూత పెట్టుకోవాలి. దీన్ని అప్పుడప్పుడు కొద్దికొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకొని తినాలి.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE