మిరియాలను సుగంధ ద్రవ్యాల్లో రాణిగా చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా వంటదినుసుగా, పలు ఔషధాల తయారీలో వీటిని వాడుతున్నారు. మనదేశంలో వేలాది ఏళ్ళ నుంచి మిరియాల పంట సాగులో ఉంది. తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగు మిరియాలూ పలు దేశాల్లో సాగులో ఉన్నాయి. మిరియాలకు ఆయుషును పెంచే శక్తి ఉందని చెబుతారు. మిరియాలు చేకూర్చే ఆరోగ్య పరమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఉపయోగాలు...

  • వంటకాల్లో మిరియాల పొడి చేర్చటం వల్ల ఊపిరితిత్తుల్లో కఫము చేరదు. ఈ కఫ సమస్య బాధితులు గ్రాము మిరియాలు దోరగా వేయించి దంచి, దాన్ని చిటికెడు లవంగాల పొడి, పావు చెంచా వెల్లుల్లి మిశ్రమంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజూ రెండు, మూడు సార్లు తీసుకొంటే కఫము పూర్తిగా తగ్గుతుంది.
  • మిరియాలు కొవ్వును కరిగించటంతో బాటు మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. అధిక బరువున్నవారు భోజనానికి గంట ముందు అరగ్రాము మిరియాల పొడిని తేనెతో తీసుకుని వేడి నీళ్లు తాగితే బరువు తగ్గుతారు.
  • చిటికెడు మిరియాల పొడిని నీటిలో కలిపి తీసుకొంటే వేసవి దాహార్తి దూరమవుతుంది.
  • గ్లాసు మరిగిన నీళ్లలో చిటికెడు చొప్పున పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి.
  • చిగుళ్లవాపు, దంతమూలాల్లో రక్తస్రావం కనిపిస్తే చిటికెడు రాతి ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని రక్తం కారేచోట రాసి తేలిగ్గా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే సమస్య దారికొస్తుంది.
  • ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలున్నవారు మిరియాల పొడిని నెయ్యితో కలిపి రాసుకుంటే చర్మ సమస్యలు తగ్గుముఖం పడతాయి. దురద బాధితులు అర చెంచా మిరియాలు, 10 వేపాకులు మిక్సీ పట్టి 1 గ్లాసు నీళ్లలో కలిపి వడకట్టి తాగితే దురద తగ్గుతుంది.
  • మిరియాలు నోటిలో లాలాజలం ఊరేలా చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అజీర్తి బాధితులు దంచిన మిరియాల పొడి, పాతబెల్లం సమపాళ్లలో కలిపి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే సమస్య దూరమవుతుంది. చిన్నారుల అరుగుదల సమస్యకు అరటిపండు పై మిరియాలపొడి చల్లి తినిపిస్తే సమస్య పరిష్కారమవుతుంది.
  • కండరాల, నరాల నొప్పుల బాధితులు చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి వాడితే సమస్యలు దూరమవుతాయి. ఒళ్లునొప్పుల బాధితులు మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్నచోట కట్టు కడితే నొప్పి, వాపు తగ్గుతుంది.
  • మిరియాలపొడి, పెరుగు కలిపి తింటే జలుబు తగ్గుతుంది. పొడి దగ్గుతో బాధపడేవారు మిరియాల పొడి, తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. నెలసరి సమస్యలున్న మహిళలకు సైతం మిరియాలపొడి, పెరుగు మిశ్రమం ఔషధంగా పనిచేస్తుంది.
  • పొట్టలోని వాయువులను ఎప్పటికప్పుడు బయటికి పంపటం, రక్తప్రసరణను మెరుగు పరచటంలో మిరియాలు కీలకపాత్ర పోషిస్తాయి.

గమనిక: మిరియాలను తగినంత మోతాదులోనే తీసుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE