గతంలో వేసవి వచ్చిందంటే నీళ్లలో సబ్జా గింజలు, చక్కెర కలుపుకు తాగేవారు. శీతలపానీయాల వినియోగం పెరిగిన తర్వాత సబ్జాగింజల వినియోగం కాస్త తగ్గినా.. ఇప్పటికీ వేసవితాపానికి ఉపశమనంగా చాలామంది సబ్జా గింజలనే వాడుతున్నారు. ఒంట్లో చేరిన ఎంతటి వేడినైనా తొలగించగల శక్తి వీటి ప్రత్యేకత. వేసవిలో కనిపించే మితిమీరిన దాహం, డీహైడ్రేషన్‌, వాంతుల వంటి సమస్యకూ సబ్జా గింజలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. అందుకే.. ఎండలు మండుతున్న ఈ సమయంలో వీలున్న మేరకు సబ్జానీటిని తాగమని నిపుణులు సూచిస్తున్నారు.

ఉపయోగాలు

 • వేసవిలో చెమటకాయల నివారణకు సబ్జా గింజల వినియోగం దోహదపడుతుంది.
 • చికెన్‌ఫాక్స్ బాధితుల్లో ఉండే శరీర తాపానికి సబ్జా గింజలు కలిపిన కొబ్బరినీరు విరుగుడుగా పనిచేస్తుంది.
 • సబ్జా నీటికి చెంచాడు చొప్పున నిమ్మరసం, చక్కెర చేర్చి 2 లేదా 3 సార్లు తాగితే ఆజీర్తి తగ్గుతుంది.
 • పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో సబ్జా గింజలు చేర్చి పిల్లలకు తాగిస్తే వడదెబ్బ ముప్పు ఉండదు.
 • అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలకు ఈ గింజల వినియోగం ఎంతగానో దోహదపడుతుంది.
 • జ్వరం బాధితులు సబ్జానీటిలో ధనియాల రసంతో కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది.
 • సబ్జా గింజల నీరు యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలు దరిజేరనివ్వదు.
 • రాత్రివేళ సబ్జాగింజల నీరు తాగితే శరీరంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి.
 • సబ్జా గింజలు శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతో పాటు అధికంగా పీచును కలిగిఉంటాయి.
 • ఈ గింజల్లో చర్మాని అందంగా ఉంచే విటమిన్ ఈ లభిస్తుంది.
 • గోరువెచ్చని నీటిలో సబ్జా గింజలు, అల్లం రసం, తేనె కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE