మానవుల పాప పరిహారార్థం శిలువపై మరణించి తిరిగి లేచిన ఏసు ప్రభువు ఆగమనాన్ని సూచించే పండుగ ఈస్టర్. ఈ వేడుకను పురస్కరించుకొని కేకులు పంచుకోవటం సంప్రదాయం. ఈస్టర్ వేడుకల్లో భాగంగా డేట్స్ కేక్ రుచిని ఆనందంగా ఆస్వాదిద్దాం. 

కావలసినవి

మైదాపిండి - 1 కప్పు, తాజా ఖర్జూరాలు - అరకప్పు, చక్కెర - ముప్పావు కప్పు (కావాలనుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చు), పాలు - ముప్పావు కప్పు, నూనె - అరకప్పు, బేకింగ్ పౌడర్ - 1 చెంచా, దాల్చినచెక్క పొడి - అరచెంచా, లవంగాల పొడి - అరచెంచా, ఎండబెట్టి దంచిన అల్లం పొడి - చిటికెడు, తరిగిన జీడిపప్పు - 4 చెంచాలు 

తయారీ

ముందుగా ఖర్జూరాల్లోని గింజలు తీసేసి ముక్కలు చేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇందులో కొద్దిగా నీళ్లు లేదా పాలు పోసి తిప్పి మరింత మెత్తగా అయ్యాక తీసి పక్కన బెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో మైదాపిండి, పాలు, చక్కెర, బేకింగ్ పౌడర్, దాల్చినచెక్క పొడి, లవంగాల పొడి, అల్లం పొడి వేసుకుని బాగా కలుపుకొని, అందులో ముందు సిద్ధం చేసుకొన్న ఖర్జూరం మిశ్రమం, తరిగిన జీడిపప్పు వేసి మరోమారు బాగా కలపాలి. చివరగా తగినంత నూనె వేసి కలిపాలి. తర్వాత కేక్ గిన్నె లోపలి భాగానికి కొద్దిగా వెన్న లేదా నూనె రాసి తయారైన మిశ్రమాన్ని అందులో పోసి ఓవెన్లో పెట్టి 350 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద అరగంట నుంచి 40 నిమిషాల పాటు ఉంచాలి. ఒవేన్ లేనివారు కేక్ గిన్నెలో పోసి స్టౌమీద పెట్టి కూడా చేసుకోవచ్చు. అయితే స్టౌ మీద చేసేవారు గిన్నెలో మిశ్రమం మీద కాస్త వెన్నను వేస్తే కేక్ పైభాగం మెత్తగా వస్తుంది. తయారైన కేకును ఖర్జూరపు ముక్కలు, డ్రై ఫ్రూట్స్ తో అలంకరించుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE