వేసవి ఉక్కపోత ధాటికి శరీరంలోని నీరు, లవణాలు చెమట రూపంలో వేగంగా బయటికి పోవటంతో త్వరగా నీరసం రావటం సహజమే. అయితే ఎండ కారణంగా కోల్పోయిన పోషకాలను తిరిగి భర్తీ చేయటమే గాక తక్షణ శక్తిని పొందాలంటే రోజుకో గ్లాసు చెరుకురసం తాగాల్సిందే అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చెరుకు రసం ప్రత్యేకతలు, తాగటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ వేసవిలో రోజూ ఒక్క గ్లాసైనా చెరుకు రసం సేవిద్దాం. 

  • చెరుకు రసంలో ఉండే గ్లూకోజ్‌ను శరీరం వేగంగా గ్రహించి వెంటనే ఉపయోగించుకుంటుంది గనుక తక్షణ ఉత్తేజాన్నిస్తుంది.
  • చెరకు రసంలో విటమిన్స్, ఖనిజలవణాలు, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
  • కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యల బాధితులకు చెరకు రసం చక్కని ఔషధంలా పనిచేస్తుంది.
  • కిడ్నీ రాళ్ళు కరగటానికి, విచ్చిన్నమై మూత్రంలో వెళ్లిపోవటానికి చెరుకు రసం వినియోగం దోహదం చేస్తుంది.
  • చెరుకురసంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి.
  • ఆల్కలీన్ స్వభావం కలిగిన చెరకు రసం ప్రొస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల లేదా రొమ్మక్యాన్సర్, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.
  • వేసవి కాలంలో చెరకు రసం త్రాగడం వల్ల శరీరపు వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది.
  • క్యాలరీలు తక్కువ.. పోషకాలెక్కువ గనుక ఊబకాయులూ తీసుకోవచ్చు.
  • ఆకట్టుకొనే రుచితో పాటు అందుబాటు ధరలో ఉంటుంది గనుక అందరూ వాడొచ్చు.
  • చెరుకు రసంలో నిమ్మ, అల్లం రసం గానీ, కొబ్బరి నీరు గానీ కలుపుకొని తాగితే మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి.

గమనిక: బయట చెరుకు రసం తాగేవారు అక్కడి పరిశుభ్రతను పరిగణలోకి తీసుకోవాలి. చెరుకురసంలో ఐస్ వాడకపోవటమే మేలు. Recent Storiesbpositivetelugu

పిల్లల చదువులో పెద్దల పాత్ర

 గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE