వేసవిలో పచ్చి మామిడికాయలతో చేసే వంటకాల్లో మ్యాంగో ఫ్రైడ్‌రైస్ ఒకటి. ఆకట్టుకొనే రుచితో బాటు పోషకాల సమాహారమైన ఈ వంటకాన్ని మీరూ ఈ రోజే చేసి రుచి చూడండి. 

కావలసిన పదార్థాలు

పొడిగా వండిన అన్నం- 6 కప్పులు, మామిడి తురుము- 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము- 2 కప్పులు, పెసర మొలకలు- 2 కప్పులు, క్యారెట్ తరుగు- 2 కప్పులు, క్యాప్సికమ్ తరుగు- 2 కప్పులు, మినప్పప్పు- 4 చెంచాలు, నువ్వులు- 4 చెంచాలు, జీడిపప్పు- గుప్పెడు, శెనగపప్పు- , మినప్పప్పు  2 చెంచాల చొప్పున ,  ఆవాలు -1  చెంచా, కొత్తిమీర తరుగు.. 4 చెంచాలు,  జీలకర్ర- 1 చెంచాలు, పసుపు- అర చెంచా, పచ్చిమిర్చి- 10, నూనె- తగినంత, ఉప్పు రుచికి తగినంత

చేసేపద్ధతి

ముందుగా నువ్వులు, మినప్పప్పు వేయించి మిక్సి పట్టాలి. పొడి పొడిగా వార్చిన అన్నంలో నువ్వులు, మినప్పప్పు పొడితోపాటు మామిడి, కొబ్బరి తురుము, పసుపులను వేసి బాగా కలియబెట్టాలి. తరువాత మొలకెత్తిన పెసళ్లను ఉడికించి పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో కాస్త నూనె వేసి జీడిపప్పు, శెనగపప్పు, చెంచా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి. అందులోనే క్యాప్సికం, క్యారెట్ తరుగు, ఉడికించిన పెసర మొలకలు వేసి మరికాసేపు వేయించి ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. చివర్లో కొత్తిమీర తరుగు పైన చల్లితే నోరూరించే మ్యాంగో ఫ్రైడ్‌రైస్ సిద్ధమైనట్లే.



Recent Stories







bpositivetelugu

పరిమళాల వాడకంలో మెళకువలు

మనసుకు, శరీరానికి హాయినిచ్చే పరిమళాలను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు, యువత ఈ విషయంలో ముందుంటారు.

MORE
bpositivetelugu

రంజాన్ దాన, ఉపవాసాల విశేషాలు

ఏ పండుగైనా శాంతిని, మానవాళి హితాన్నే ప్రబోధిస్తుంది. రంజాన్ (రమదాన్) పండుగా ఇదేవిషయాన్ని చెబుతోంది. ఇస్లామీయ కేలండర్లో

MORE