వేసవి ఫలాల్లో నేరేడుది ప్రత్యేక స్థానం. దీని శాస్త్రీయ నామము సిజిజియం క్యుమిన్‌ . కన్నుచెదిరే రంగు, ఆకట్టుకొనే రుచితో బాటు బోలెడన్ని పోషకాలను అందించే నేరేడు సుగుణాల గురించి ఎంతచెప్పినా తక్కువే. నేరేడు చెట్టు వేరు మొదలు చిగుళ్ళవరకు అణువణువూ ఔషధభరితమే. ఆరోగ్య పరిరక్షణలో నేరేడు ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

 • నేరేడులో పిండి పదార్థాలు, కొవ్వు బహుస్వల్పంగా ఉంటాయి గనుక దీన్ని ఊబకాయులు, మధుమేహులు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. మధుమేహులు నేరేడు గింజల పొడిని నీటిలో కలుపుకు తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకివస్తాయి.
 • గ్యాస్‌, అజీర్తి సమస్య ఎదురై అసౌకర్యంగా ఉంటే, 4 పండిన నేరేడు పండ్లు తింటే ఉపశమనం కలుగుతుంది.
 • నేరేడు పండ్ల వినియోగంతో రక్తహీనత దరిజేరదు. రక్తశుద్ధి కూడా జరుగుతుంది.
 • జిగట విరేచనాల బాధితులు 3 చెంచాల నేరేడు రసం తాగినా లేదా నీటిలో నేరేడు బెరడు కషాయం, తేనె, చక్కెర కలిపి తాగినా సమస్య దారికొస్తుంది. నీరసం కూడా తగ్గుతుంది.
 • నేరేడు పండ్లు తింటే కాలేయ సంబంధిత సమస్యలు తొలగిపోయి కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.
 • నేరేడులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు, గుండె ఆరోగ్యానికి రక్షగా నిలుస్తాయి. రక్తక్యాన్సర్‌ కారకాలను కూడా నిరోధిస్తాయి.
 • అధిక జ్వర బాధితులు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.
 • మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపిస్తే 2 చెంచాల చొప్పున నిమ్మ, నేరేడు రసం గ్లాసు నీళ్లలో కలిపి తీసుకుంటే మంట తగ్గుతుంది.
 • నేరేడు ఆకుల కషాయం తాగితే .. బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
 • నేరేడు ఆకుల కషాయంతో నోరు పుక్కిలిస్తే పంటినొప్పి, చిగురువాపు, నోట్లో పుండ్లు, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి.
 • కీటకాలు కుట్టినచోట నేరేడు ఆకు రసంలో పసుపు కలిపి రాస్తే నొప్పి, దురద, దద్దుర్లు తగ్గి ఉపశమనం కలుగుతుంది.
 • నెలసరి సమస్యలున్నవారు నేరేడు బెరడు కషాయాన్ని నెలరోజులు 30 మి .లీ చొప్పున రోజుకు 2 సార్లు తాగితే గుణం కనిపిస్తుంది.

పోషకాలు (వందగ్రాముల్లో)

నీరు- 83.7గ్రా, పిండి పదార్థం- 19 గ్రా, మాంసకృత్తులు- 1.3గ్రా, కొవ్వు- 0.1గ్రా, ఖనిజాలు- 0.4గ్రా, పీచు- 0.9 గ్రా, క్యాల్షియం- 20 మి.గ్రా, ఐరన్ - 0.7 మి.గ్రా, సల్ఫర్‌- 13 మి.గ్రా, విటమిన్‌ సి- 18 మి.గ్రా.

గమనిక

 • నేరేడు అరగడానికి ఎక్కువసమయం తీసుకొంటుంది కనుక కొద్దిగా ఉప్పు చల్లుకు తింటే మంచిది.
 • భోజనం చేసిన గంట తరవాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
 • ఒకేరోజు ఎక్కువమొత్తంలో నేరేడు పండ్లు తింటే మలబద్ధకం, కడుపునొప్పి తప్పవు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE