తాలింపు అనగానే ముందు గుర్తొచ్చేది కరివేపాకే. ఉప్మా మొదలు ఇష్టంగా తినే పులిహోర వరకు కరివేప లేకపోతే అసలైన రుచి రానేరాదు. కరివేపలో ఎన్నో విధాలైన ఔషధ విలువలున్నాయి. ఇదితెలియక చాలామంది కూరల్లో, చారుల్లో వేసిన కరివేపాకును నిర్లక్షంగా తీసి పక్కనపెడుతుంటారు. అందుకే ఆరోగ్య, సౌందర్య పరిరక్షణలో కరివేప ఉపయోగాన్ని తెలుసుకొని దాన్ని వీలున్న మేరకు వాడదాం. 

  • కరివేపను కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు రాలటం తగ్గటమే గాక జుత్తు ఒత్తుగా పెరుగుతుంది. బాలనెరపు సమస్య రాదు.
  • కప్పు కరివేపాకు రుబ్బి అందులో 3 చెంచాల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్‌ వేసుకొని ఆరాక తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి నెరిసిన జుట్టు నల్లబడుతుంది.
  • సమపాళ్లలో కరివేప, వేప కలిపి నూరి చెంచా మిశ్రమాన్ని అరకప్పు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి.
  • మధుమేహులు వంటకాల్లో కరివేపను వాడటం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది.
  • కరివేపను మెత్తగా నూరి నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తే మచ్చలు పడవు. గాయం కూడా వేగంగా మానుతుంది.
  • దురద బాధితులు కరివేప, పసుపు సమంగా తీసుకుని పొడి చేసి రోజూ చెంచా చొప్పున నెలరోజులు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.
  • కరివేప రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి రోజూ కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయి.
  • నీళ్లవిరేచనాల బాధితులు గుప్పెడు కరివేపాకు నూరి ఒకటి రెండు చెంచాల మిశ్రమాన్ని అరకప్పు మజ్జిగలో కలిపి రోజుకు 3 లేదా 4 సార్లు సేవిస్తే వెంటనే తగ్గుతాయి.
  • తేనెటీగల వంటి కీటకాలు కుడితే కరివేపాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి కుట్టినచోట రాస్తే బాధ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
  • ప్రాథమిక దశ కిడ్నీ సమస్యల బాధితులు చెంచా కరివేప రసాన్ని రోజూ 2 పూటలా తీసుకుంటే సమస్యల నుంచి బయటపడొచ్చు. 



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE