ఆక‌ర్ష‌ణీయమైన రంగుతో నిగ‌నిగ‌లాడుతూ క‌నిపించే దానిమ్మ పండు ఆరోగ్యానికి కొండంత అండ. ముఖ్యంగా గుండె జబ్బుల బారినుంచి కాపాడటంలో ఇది ముందుంటుంది. రోజూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలేమిటో తెలుసుకుందాం.

  • దానిమ్మ వినియోగంతో రక్తనాళాలు, గుండె గదుల పనితీరు మెరుగుపడుతుంది. దానిమ్మ‌లోని స‌హ‌జ యాస్పిరిన్ గుణాలు ర‌క్త స‌ర‌ఫ‌రాను వేగ‌వంతం చేస్తాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది.
  • దానిమ్మ లైంగిక సామ‌ర్థ్యాన్ని, సంతాన సాఫ‌ల్య‌త‌ను పెంచుతుంది. గ‌ర్భ‌స్థ శిశువుల ఎదుగుదలకు దోహదం చేసే ఫోలిక్ యాసిడ్ దానిమ్మ లో పుష్క‌లంగా ల‌భిస్తుంది. అందుకే తరచూ గ‌ర్భిణులు దానిమ్మ తీసుకోవాలి.
  • దానిమ్మ‌లో లభించే విట‌మిన్ ఎ,సి,ఈ, బి5, ప్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు హానికారక ప్రీరాడిక‌ల్స్‌కు వ్య‌తిరేకంగా పోరాడి క్యాన్సర్ , అల్జీమర్స్‌ రాకుండా చేస్తాయి.
  • వ‌య‌సు పెరిగిన కొద్దీ ఏర్ప‌డే ముడ‌త‌ల‌ను దానిమ్మ ర‌సం నివారిస్తుంది.
  • రుతు స‌మ‌యంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడికి దానిమ్మ రసం విరుగుడుగా ప‌నిచేస్తుంది.
  • అల‌ర్జీలు, కీట‌కాలు కుట్టినచోట దానిమ్మరసం రాస్తే వాపు, నొప్పి తగ్గుతాయి.
  • నీళ్ల విరేచ‌నాల‌తో బాధ‌ప‌డేవారికి ఇది మంచి మందు. అల్స‌ర్ల‌ను నివారిస్తాయి. దంతాల చిగుళ్ల‌ను బ‌ల‌ప‌రుస్తాయి.
  • వయసుతోబాటు తగ్గే కీళ్ల మధ్య జిగురు నశించకుండా చేస్తుంది. ఆస్టియో ఆర్ధరైటీస్‌ వంటి వ్యాధులనూ నియంత్రిస్తుంది.
  • రక్తపోటును క్రమబద్దీకరిస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE