ఈ ఏడాది మృగశిర వస్తూనే మంచి వర్షాన్నీ వెంటతెచ్చింది. తెలుగువారికి మృగశిర కార్తెలో చేపలు తినటం అనవాయితీ. మరీ ముఖ్యంగా కార్తె ప్రవేశించిన రోజు చేప తింటే రాబోయే వర్షాకాలమంతా మంచి ఆరోగ్యం చేకూరుతుందని పెద్దల నమ్మకం. మిగిలిన రోజుల్లో చేసే పద్దతిలో కాకుండా ఈ రోజు బెల్లం వేసి చేపల పులుసు చేయటం సంప్రదాయం. మరి మనమూ ఈ రోజు నోరూరించే మృగశిర చేప పులుసు రుచి చూద్దాం. 

కావలసినవి

చేప ముక్కలు - 200 గ్రా , చింతపండు - 100 గ్రా, ఉల్లిపాయలు - 2, కరివేపాకు - 4 రెమ్మలు , వెల్లుల్లి - 4 రెబ్బలు , జీలకర్ర, మెంతులు - అర చెంచా చొప్పున, ఇంగువ , పసుపు - చిటికెడు చొప్పున , పచ్చిమిర్చి - 4 , . , బెల్లం - 50 గ్రా. , ఉప్పు, కారం - తగినంత 

చేసే పద్దతి 

చేపలను ఒంటిమీది పొలుసులన్నీ పోయేవరకు బాగా రుద్ది కడిగి కోసుకోవాలి. ఈ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి. మూకుడులో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి రంగుమారి వరకు సన్నని సెగమీద వేగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఇంగువ వేసి చేప ముక్కలను వేసి మిశ్రమం పట్టేలా కలిపి కొద్దిగా వేగాక నీళ్లు పోయాలి. నీరు బాగా మరిగిన తర్వాత పసుపు, చింతపండు, కారం, ఉప్పు వేసి కలిపి మరికాసేపు మరగనిచ్చి చివరగా బెల్లం తురిమి వేసి కలపాలి. దీన్ని సన్నని సెగ మీద పదినిమిషాల పాటు ఉంచితే వేడి.. వేడి చేపల పులుసు రెడీ!



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE