ఆరోగ్య పరిరక్షణలో అవిసెలు చేసే మేలు అంతా ఇంతాకాదు. చిరు ధాన్యాలు, తృణధాన్యాల వినియోగం తక్కువగా ఉన్న ఈ రోజుల్లో వీటి గురించి తెలియని వారూ లేకపోలేదు. అయితే.. మధుమేహాన్ని అదుపు చేయడం మొదలు మెదడును చురుకుగా ఉంచడం వరకూ ఎన్నో రకాలుగా అవిశెలు పనికొస్తాయని తెలిస్తే మాత్రం వీటిని వాడకుండా ఉండలేరు. ఆరోగ్యంతో బాటు సౌందర్య పరిరక్షణకూ దోహదం చేసే అవిసెలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కలిగే ఉపయోగాలను పోషకాహార నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. 

  • అవిసెల్లో ఒమేగా -3 యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఏదోరూపంలో గుప్పెడు అవిసెలు శరీరానికి అందితే ఎలాంటి హృద్రోగాలు దరిజేరవు.
  • అవిసెల్లో అధికంగా ఉండే పీచు పదార్దం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు దూరమవుతాయి.
  • మాంగనీస్‌, విటమిన్‌ బి1, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్‌లు పుష్కలంగా లభించే అవిసెల వినియోగంతో మెదడు పనితీరు మెరుగై మతిమరుపు సమస్య రాదు.
  • అవిసెల వినియోగంతో రక్తపోటును అదుపులోకి రావటమే గాక రక్తంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.
  • మధుమేహుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపు చేయటంలో అవిసెల వినియోగం కీలకపాత్ర పోషిస్తుంది.
  • అవిసెల్లోని రసాయనాలు యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచటమే గాక ప్రొస్టేట్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, పెద్దపేగు సమస్యలను నిరోధిస్తాయి.
  • నెలసరి సమయాల్లో శరీరంలో వేడిని తగ్గించడంలో అవిసెలు విశేషంగా పనిచేస్తాయి.
  • గోళ్లు పొట్టులా రాలుతుంటే అవిసెగింజల్ని తీసుకుంటే సమస్య త్వరగా దారికొస్తుంది. 

పోషక విలువలు (అవిసె గింజలు - 100 గ్రాములు)

కార్బొహైడ్రేట్లు      -   29 గ్రా

డైటరీ ఫైబర్‌        -   27 గ్రా

మాంసకృతులు   -   18 గ్రా

కొవ్వులు           -  40 గ్రా

కొలెస్ట్రాల్            -   0 మి.గ్రా

సోడియం           -  30 మి. గ్రా

పొటాషియం       -    813 మి.గ్రా

కాల్షియం           -   25%

మెగ్నీషియం      -    98%

ఐరన్‌               -   31%

విటమిన్‌ బి-6     -      25%Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE