వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్లో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్ల బారినపడే ముప్పు ఎక్కువ. ఈ కాలంలో జీర్ణశక్తి కూడా మందగించటం సహజమే. అందుకే మారిన వాతావరణాన్ని బట్టి తీసుకొనే ఆహారంలో తప్పకుండా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఈ విషయంలో పోషకాహార నిపుణులు సూచిస్తున్న అంశాలను తెలుసుకుందాం. 

  • ఈ సీజన్‌లో కూరగాయలు, ఆకుకూరలపై బ్యాక్టీరియా, ఇతర క్రిములు ఉండే ప్రమాదం ఎక్కువ గనుక వాటిని నేరుగా తీసుకోవద్దు. తప్పక కడిగి ఉడికించి మాత్రమే తినాలి.
  • వర్షాకాలంలో వేపుళ్ళ కంటే ఆవిరి మీద వండినవి తినటం ఆరోగ్యానికి మంచిది. సహజంగానే వర్షాకాలంలో మాంసం వినియోగం ఎక్కువ. అయితే మాంసాన్ని బాగా ఉడికించి తినాలి. వేపుడు వంటకాల కంటే గ్రిల్డ్ లేదా ఉడికించిన మాంసాహార వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • వర్షాకాలంలో.. వ్యాధినిరోధకతను పెంచే నిమ్మ, నారింజ, బత్తాయి, జామ, దానిమ్మ వంటి విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు తినాలి. అలాగే కాప్సికమ్, బెర్రీస్, గుమ్మడి వంటి యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
  • ఈ రోజుల్లో దాహం తక్కువ గనుక నీరు తాగటమూ తక్కువే. దీనివల్ల జీర్ణశక్తి మందగించడంతో బాటు పలు సమస్యలు రావచ్చు. కనుక తగినంత కాచి చల్లార్చిన నీరు తాగాలి. రోజుకోసారి పండ్ల రసాలు, తాజా కూరగాయల రసాలు తాగితే ఒంట్లోని నీటి నిల్వలు స్థిరంగా ఉంటాయి.
  • వర్షాకాలంలో తరచూ గోరువెచ్చని సూపులు, పానీయాలు తాగాలి. ముఖ్యంగా అల్లం, లెమన్, గ్రీన్ టీలను తీసుకుంటే శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు.

 ఇవి వద్దే వద్దు

  • జల కాలుష్యం పొంచి ఉండే ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ నీరు తాగకూడదు. ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే పానీపూరి అసలే తినొద్దు.
  • వర్షాకాలంలో క్రిములు వేగంగా వ్యాప్తి చెందుతాయి గనుక ఈ రోజుల్లో బయట సలాడ్స్‌ తినరాదు. ఎప్పుడో కోసిపెట్టిన ఈ పండ్లు, కూరగాయల ముక్కల్లో తేమ చేరి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే సలాడ్స్ తినాలనుకొంటే తాజాగా చేసుకొని తినాలి.
  • వాతావరణం చల్లబదగానే మనసు వేడివేడి చిరు తిళ్ళమీదికి.. ముఖ్యంగా రోడ్డువెంట వేసే వేడివేడి పకోడీలు, సమోసాలు, బజ్జీలమీదికి పోతుంది. జీర్ణశక్తి తక్కువగా ఉండే ఈ రోజుల్లో పదేపదే ఈ వంటకాలు తింటే ఎసిడిటీ, మలబద్దకం రాకమానవు. అందుకే వీటిని పక్కనబెట్టండి.
  • శ్వాసకోశ సమస్యలు, మైగ్రేన్‌, సైనసైటిస్ బాధితులు ఈ రోజుల్లో చల్లని పెరుగు, ఐస్‌క్రీమ్స్‌కు లకు దూరంగా ఉండాలి. పాలు తాగేవారు గోరువెచ్చనిపాలలో పసుపు వేసుకొని తాగాలి.
  • వర్షాకాలంలో ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది గనుక నూడిల్స్ వంటి ఫాస్ట్‌ఫుడ్స్ తగ్గించాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE