తొలకరిజల్లులు పలకరిస్తున్న ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా చికెన్ వంటకాలు రుచి చూడటంలో ఉండే మజాయే వేరు. అందులో ఘాటైన మసాలా జోడించి చేసే ఈ చికెన్ బాల్స్ రుచి మరింత ప్రత్యేకం. పైగా త్వరగానూ చేయొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించే ఈ వంటకం తయారీ వివరాలివి. 

కావలసినవి

బోన్‌లెస్‌ చికెన్‌ - 200 గ్రా., అల్లం తరుగు, మెంతి ఆకు, పచ్చిమిర్చి తరుగు, వెల్లులి తరుగు- చెంచా చొప్పున, ఉల్లి తరుగు- 3 చెంచాలు , కొత్తిమీర తరుగు -2 చెంచాలు, దంచిన లవంగాలు -2, కారం - అరచెంచా, గరమ్‌ మసాలా - అరచెంచా, ఉప్పు- రుచికి తగినంత 

తయారీ

ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టిన చికెన్‌ను శుభ్రంగా కడిగి నీరులేకుండా పిండి మిక్సీలో వేసి మెత్తగా తిప్పాలి. దాన్లో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి కలిపి మరోమారు తిప్పి పక్కనబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఆవిరి మీద బాగా ఉడికించి వేడివేడిగా సాస్‌తో తింటే కమ్మగా ఉంటాయి.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE