కశ్మీర్.. దేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. పర్యాటకులను కశ్మీర్ ప్రకృతి ఎంతగా ఆకర్షిస్తుందో అక్కడి వంటకాలూ అంతగా అలరిస్తాయి. ఈ జాబితాలో చెప్పుకోదగిన వంటకం.. కశ్మీరీ చికెన్. వానాకాలంలో సరికొత్త రుచులను ఆస్వాదించాలనుకొనే వారంతా తప్పక దీన్ని ట్రై చేయాల్సిందే.  

కావలసినవి

అరకిలో చికెన్‌, వెల్లుల్లి - 5 రేకలు, అల్లం - అంగుళం ముక్క, ఉల్లి తరుగు - 2 కప్పులు, ఎండు మిర్చి - 2, కశ్మీరీ కారం- ఒకటిన్నర చెంచాలు, ధ నియాల పొడి - చెంచా, జీలకర్ర - పావు చెంచా, యాలకులు - 6, దాల్చిన చెక్క - 2 అంగుళాలు, జీడిపప్పు -50 గ్రా., బాదం - 25 గ్రా., పెరుగు - 100 గ్రా., ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 గరిటెలు, కొత్తిమీర తరుగు - పావు కప్పు. 

తయారీ

ముందుగా చికెన్‌ ముక్కలకు ఉప్పు కలిపి పక్కనబెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు విడివిడిగా వేయించి దంచి కాశ్మీరీ కారంలో వేసి కలపాలి. అలాగే జీడిపప్పు, బాదం పలుకులు కూడా సన్నని సెగ మీద దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. అనంతరం.. వెడల్పాటి మూకుడులో నూనెపోసి అందులో ఉల్లి తరుగు , అల్లం, వెల్లుల్లి తరుగు ఒకదానితర్వాత వేసి దోరగా వేగాక అందులో చికెన్‌ ముక్కలు వేసి సన్న మంటపై 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత సిద్ధం చేసుకొన్న గరం మసాలా పొడి, ఉప్పు కలిపి మరో 2 నిమిషాలు వేయించి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఉడుకుతున్న సమయంలో అందులో జీడిపప్పు, బాదం పొడి కలపాలి. ముక్క మెత్తబడగానే పెరుగు కలిపి సన్నని సెగమీద 5 నిమిషాలు ఉంచి, కొత్తిమీర చల్లి దించేయాలి. దీన్ని వేడివేడిగా రొట్టె, నాన్‌, బ్రెడ్‌తో తింటే రుచి ఎంతో బాగుంటుంది. అన్నంలోనూ కలుపుకొని తినొచ్చు. Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

జపమూ యజ్ఞమే

పరమాత్మను చేరేందుకు సాయపడే సులువైన మార్గాల్లో జపం ముఖ్యమైనది. యోగసాధనలోనూ జపం ఒక ముఖ్యాంశంగా ఉంది. జప 

MORE