తొలకరి జల్లులకు మనసు పులకరించే ఈ రోజుల్లో మనసు వేడివేడి చిరుతిళ్ల మీదికి పోవటం సహజమే. ఇలాంటి సందర్భాల్లో ముర్గ్ మలై కబాబ్ రుచి చూడాల్సిందే. మంచి రుచితోబాటు పోషకాలుండే ఈ కబాబ్ తయారు ఎలాగో తెలుసుకుందాం. 

కావలసినవి

ఎముకలు లేని ఓ మోస్తరు సైజు చికెన్‌ ముక్కలు- 15, తెల్ల మిరియాల పొడి-1 చెంచా, మసాలా చాట్‌- 2 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్టు: 1 చెంచా, పచ్చిమిర్చి- 3 (సన్నగా తరగాలి) కొత్తిమీర తరుగు- అరచెంచా, తాజా మీగడ- 2 గరిటెలు, చీజ్‌ తురుము : 1/2 కప్పు, బటర్‌- 2 చెంచాలు, పుల్లని పెరుగు- 2 చెంచాలు, మొక్కజొన్న పిండి- 4 గరిటెలు, ఉప్పు: రుచికి సరిపడ. 

తయారీ

ముందుగా ఒక గిన్నెలో కడిగిన చికెన్‌ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చికెన్ ముక్కల్లో మీగడ, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, చీజ్ తురుము, మొక్కజొన్న పిండి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ చికెన్ గిన్నెను మూతపెట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. కబాబ్‌ చేసే గంట ముందు ఫ్రిజ్‌లో నుంచి గిన్నె బయటపెట్టి అవి గది ఉష్ణోగ్రతకు రాగానే ముక్కలను స్కీవర్స్‌కు గుచ్చుకోవాలి. ఇప్పుడు ఓవెన్‌ బేకింగ్‌ ట్రే అడుగున సిల్వర్‌ ఫాయిల్‌ పరచి, వాటిపై గుచ్చిన చికెన్ ముక్కలు సర్ది ఓవెన్‌ ను గ్రిల్‌ మోడ్‌ లోకి పెట్టి 250 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో ప్రీహీట్‌ చేయాలి. ఒక 8నిమిషాలు గ్రిల్‌ చేసి తర్వాత బయటకు తీసి తిప్పి పెట్టి మరో 10 నిమిషాలు తిరిగి గ్రిల్‌ చేస్తే ముర్గ్ మలై కబాబ్స్ రెడీ అయినట్లే. వీటిపై కొద్దిగా బటర్‌ బ్రష్ చేసి, ఛాట్‌ మసాలా చల్లి వేడి వేడిగా కొత్తిమీర చట్నీతో సర్వ్‌ చేయాలి.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

జపమూ యజ్ఞమే

పరమాత్మను చేరేందుకు సాయపడే సులువైన మార్గాల్లో జపం ముఖ్యమైనది. యోగసాధనలోనూ జపం ఒక ముఖ్యాంశంగా ఉంది. జప 

MORE