ఇంట్లోనే వెరైటీ రుచుల చాక్లెట్‌ తయారు చేద్దామనుకొనే వారికి మిల్క్‌కోకో చాక్లెట్‌ ఒక మంచి ప్రత్యామ్నాయం. సులభంగా, తక్కువ సమయంలో చేసుకోదగిన మిల్క్‌కోకో చాక్లెట్‌ ఎలా చేయాలో తెలుసుకుందాం. 

కావలసినవి

   చక్కెర పొడి, పాలపొడి చొప్పున -200 గ్రా, కోకోపౌడర్‌ -3 గరిటెలు, నీళ్లు-అర కప్పు, ఉప్పులేని వెన్న-100 గ్రా

తయారీ

  ముందుగా పాలపొడిని, కోకోపౌడర్‌ను వేర్వేరుగా జల్లించి, ఆ తర్వాత రెండూ కలిపి ఒకే పాత్రలోకి జల్లించుకోవాలి. తర్వాత దీర్ఘచతురస్రాకారపు పళ్లెంలో కొద్దిగా నెయ్యి పూసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌపై ఒక మందపాటి పాన్‌ పెట్టి అందులో చక్కెర, నీరు పోసి లేత తీగ పాకం వచ్చిన తర్వాత సిమ్‌లో పెట్టి దానిలో వెన్నను వేసి కరిగే దాకా తిప్పాలి. చివరగా అందులో పాలపొడి, కోకోపొడి మిశ్రమాన్ని పోసి బాగా కలిపి మరో 2 నిమిషాలు ఉంచి ఆ మిశ్రమాన్ని నెయ్యి పూసిన ప్లేట్‌లో పోయాలి. దీన్ని చల్లారిన తర్వాత ఇష్టమైన ఆకారంలో ముక్కలను కట్‌ చేసుకొంటే కమ్మని మిల్క్ కోకో చాక్లెట్‌ రెడీ.Recent Storiesbpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE