ఏ సంస్కృతిలోనైనా ఆహారపుటలవాట్లు ఒక భాగంగా ఉంటాయి. ముఖ్యంగా అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను బట్టి ఈ ఆహారపు అలవాట్లు మారుతుంటాయి. ఇటీవలికాలంలో ప్రపంచ వ్యాప్తంగా శాకాహారపు ప్రాముఖ్యం గురించి చర్చ జరుగుతోంది. అయితే ఇది సంస్కృతి, వ్యక్తిగత అభిరుచికి సంబంధించిన అంశం గనుక ఫలానా ఆహారం మంచిదనీ , మరొకటి కాదనీ అనలేము. అయితే మారుతున్న కాలంతో బాటు పర్యావరణ దృక్కోణంలో ఆహారపుటలవాట్లను సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ సమస్య

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల జంతువుల్ని ఆహారం కోసమే పెంచుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూభాగంలో 30 శాతాన్ని కేవలం పశుపోషణకు వాడుతున్నారనీ, ప్రపంచవాప్తంగా మాంసాహార వినియోగం 2050 నాటికి రెట్టింపయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ చెబుతోంది. పశువుల ఆహారం, నిర్వహణ కోసం పెద్దఎత్తున ప్రకృతి వనరుల వినియోగం, విధ్వంసం జరుగుతోందనీ, ఇదిలా కొనసాగితే ఈ శతాబ్దపు చివరికి భూతాపం 4 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరగనుందనీ హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితిని నివారించాలంటే మాంసం కోసం ఉద్దేశించిన పశుపోషణ కేంద్రాలను 35 శాతం మేర తగ్గించాలని ఆ సంస్థ సూచిస్తోంది. శాకాహారంపై ఆధారపడటం పెరిగితే రానున్న కాలంలో వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి వీలుకలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

శాకాహారమే ఎందుకు?

  • శాకాహారంలో ట్రాన్స్ ఫ్యాట్స్, హార్మోన్లు, యాంటీబయాటిక్స్, నైట్రేట్లు, నైట్రోసమైన్స్, సోడియం ప్రిజర్వేటివ్స్ వంటి హానికారకాలు తక్కువే గాక మాంసకృత్తులతోపాటు పీచు, తగినన్నిఅమినో యాసిడ్లు లభిస్తాయి.
  • మాంసాహారంలో పీచు ఉండదు. అదే శాకాహారం తీసుకొంటే బోలెడంత పీచు లభించటమే గాక పీచు వల్ల శరీరంలోని వ్యర్ధాలు సైతం బయటికి పోతాయి.
  • మాంసాహార వినియోగంతో శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగి కిడ్నీల మీద ఒత్తిడి పెరగటమే గాక శరీరం కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి. శాకాహారుల్లో ఇలాంటి సమస్యలు తక్కువ.
  • శాకాహారం కంటే మాంసాహారం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. శాకాహారం సులువుగా జీర్ణమవుతుంది. పైగా సులభంగా నమిలి తినొచ్చు.
  • పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదే.. మాంసాహారమైతే చర్మానికి ఎలాంటి ఉపయోగం లేదు.
  • బరువు తగ్గించుకోవాలనుకొనేవారు మాంసాహారానికి బదులు శాకాహారం తీసుకొంటే మంచి ఫలితాలుంటాయి.
  • మాంసం కోసం చేపట్టే పశుపోషణ కంటే కూరగాయలు, పప్పుధాన్యాల, పండ్ల సాగు లాభసాటి, సులభమైన వ్యవహారం. పైగా ఇది పర్యావరణ హితమైనది కూడా.
  • ఎకరం భూమిలో చేపట్టే పశుపోషణ ద్వారా ఉత్పత్తి చేసిన మాంసంలోని మాంసకృత్తులకన్నా.. పంటలసాగు ద్వారా అంతకు 5 రెట్లు మాంసకృత్తులు లభిస్తాయి.
  • రసాయనిక వ్యవసాయం వల్ల వ్యవసాయోత్పత్తుల్లో బి12 వంటి విటమిన్లు, సూక్ష్మపోషకాలు కొరవడుతున్నాయి. అదే.. సారవంతమైన భూముల్లో పర్యావరణానికి హానిచేయని పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో సకల పోషకాలూ పుష్కలంగా లభిస్తాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE