సీ ఫుడ్ వంటకాల్లో రొయ్యల వేపుడు ఎంతో ప్రత్యేకం. తగిన రీతిలో చేసిన ఈ వేపుడును రుచి చూసిన ఎవరైనా ఆహా అనాల్సిందే. ఇంట్లోనే సులభంగా చేసుకోదగిన ఈ వంటకపు తయారీ ఎలాగో తెలుసుకుందాం.

కావలసినవి

రొయ్యలు -1కిలో, అల్లం వెల్లుల్లి పేస్టు- గరిటెడు, ఉల్లిపాయ- 1 (పెద్దది), పచ్చి మిర్చి- 3, సాజీరా- పావు చెంచా

గరం మసాలా - 2 చెంచాలు, పసుపు - చిటికెడు, కారం- 1 చెంచా, పెరుగు - 2 చెంచాలు, కొత్తిమీర- 10 రెబ్బలు, కరివేపాకు -2 రెబ్బలు, 

చేసే పద్దతి 

కొన్నప్పుడే రొయ్యల పొట్టు తీయించి, ఇంటిదగ్గర మరో 2 సార్లు నీటితో బాగా కడగాలి. దీనివల్ల మిగిలిపోయిన సన్నని పొత్తు వదిలిపోతుంది. ఇప్పుడు వీటిని కాస్త పసుపు, ఉప్పు , కొంచెం మజ్జిగ వేసి మరోమారు వాసన పూర్తిగా పోతుంది. శుభ్రపరచిన రొయ్యల్ని వెడల్పాటి మందమైన గిన్నెలో వేసి 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెంచా గరం మసాలా, కొంచెం కారం, ఉప్పు, పెరుగు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. రొయ్యల నుంచి వచ్చే నీరే దాదాపు ఉడికేందుకు సరిపోతుంది గనుక ఎక్కువగా నీళ్లు పోయాల్సిన పనిలేదు. వాటిలోని నీళ్లు ఇగిరిన తర్వాత మూత తీసి ఉంచి 3 నిమిషాల తర్వాత పొయ్యి ఆపాలి. 

తర్వాత మరో వెడల్పాటి నాన్ స్టిక్ పాన్ తీసుకొని నూనెవేసి కాగిన తర్వాత సాజీరా వేసి వేగనిచ్చి కోసిన ఉల్లి ముక్కలు, రవ్వంత ఉప్పు వేసి వేగనివ్వాలి. (ముందే ఉప్పు వేసాము గనుక ఇప్పుడు చూసి వేసుకోవాలి). ఇప్పడు కరివేపాకు, చీల్చిన మిర్చి వేసి వేయించండి. ఇవి తగినంత వేగాక అందులో ఉడికిన రొయ్యల మిశ్రమాన్ని వేసి నెమ్మదిగా కలుపుతూ వేగనివ్వాలి. చివరగా కారం, మిగిలిన గరం మసాలా పొడి వేసి కలిపి దించేముందు తరిగిన కొత్తిమీర వేసుకొంటే రుచికరమైన రొయ్యల వేపుడు రెడీ అయినట్టే. 

గమనిక: టైగర్ రొయ్యలు వేపుడు చేసేటప్పుడు ఒక్కోదాన్ని రెండుగా కోసుకుంటే బాగా వేగుతాయి.ఉడికిన తర్వాత కూడా రొయ్యలకున్న ఈనెలు తీసేస్తే తినడానికి బాగుంటుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE