ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మసాలా దినుసుల్లో జీలకర్ర రెండోది. లెక్కకు మించిన  ఔషధ గుణాలున్న జీలకర్ర 2 రూపాల్లో లభిస్తుంది. ఒకటి రోజూ వాడే గోధుమవర్ణపు రకం కాగా రెండోది మసాలావంటకాల్లో వాడే షాజీరా. తగినంత కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియంతో బాటు ఎన్నో విటమిన్స్ గల జీలకర్ర ఆరోగ్యానికి జీవగర్ర అనీ, దీని రోజువారీ వినియోగం పలు రుగ్మతలను దూరం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఉపయోగాలు

 • జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్ధాలను వదిలించటమే గాక ఫ్రీ రాడికల్స్ బెడద నుంచి శరీరాన్ని కాపాడతాయి.
 • రోజా వంటల్లో జీలకర్ర వాడితే అజీర్తి, మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు రానేరావు. కడుపులో నులిపురుగులూ చేరవు.
 • కడుపులో వికారం, వాంతులు, పులి తేనుపులు ఉన్నప్పుడు కొంచం జీలకర్ర నమిలి రసం మింగితే ఉపశమనం లభిస్తుంది.
 • జీలకర్రను కషాయం తాగితే ఎలర్జీ కారక బాధలు తగ్గుతాయి. చెంచా నెయ్యి లో అరచెంచా జీలకర్ర పొడి కలిపి వారం రోజుల పాటు పరగడుపున తీసుకుంటే కడుపులోపలి అల్సర్ తగ్గుతుంది.
 • నల్ల జీలకర్ర కషాయాన్ని సేవిస్తే రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. మొలలల సమస్యకు నల్ల జీలకర్ర మంచి ఔషధం.
 • డయేరియా బాధితులు గ్లాసు నీటిలో చెంచా చొప్పున జీలకర్ర, కొత్తిమీర రసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే సమస్య దారికొస్తుంది.
 • నిద్రలేమి బాధితులు వేయించిన నల్లజీలకర్రను మగ్గిన అరటిపండుతో తీసుకుంటే కంటినిండా నిద్రపడుతుంది.
 • అల్లం తురుమును గ్లాసు నీటిలో మరిగించి అందులో పావుచెంచా చెంచా జీలకర్ర కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, మంట, జలుబు, జ్వరం తగ్గుతాయి.
 • జీలకర్రలోని విటమిన్ E’ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. జీలకర్ర లేహ్యన్ని రాయటం వల్ల మొటిమలు, గజ్జి, సొరియాసిస్ వంటి చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 • గ్లాసు నీటిలో చెంచా నిమ్మరసం, కొద్దిగా జీలకర్ర పొడి, చిటికెడు ఉప్పు కలిపి తాగితే ఒంటికి చలువ చేయటమే గాక గ్యాస్ సమస్య తగ్గుతుంది.
 • జీలకర్ర వినియోగంతో జుట్టుకుదుళ్ళకు బలం చేకూరి జుట్టు రాలటం ఆగుతుంది. సమ నిష్పత్తిలో ఆలివ్, జీలకర్ర నూనెలు కలిపి తలకు మర్దన చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది. జీలకర్ర పొడి వేసి కాచిన కొబ్బరి నూనెను తలకి పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు వదిలిపోయింది.
 • జీలకర్ర వాడే మహిళల్లో నెలసరి సమస్యలు రావు. జీలకర్ర వాడే గర్భిణులకు వేవిళ్ల ఇబ్బంది తగ్గుతుంది. పిండం ఎదుగుదలకు, సుఖప్రసవానికి జీలకర్ర దోహదం చేస్తుంది.
 • కఫ సమస్యల బాధితుల జీలకర్ర కషాయం సేవిస్తే గుణం కనిపిస్తుంది.

గమనిక: జీలకర్ర పొడిని నిల్వ ఉంచితే అందులోని ఔషధీయ తైలాలు ఆవిరైపోతాయి గనుక పొడిచేసుకొన్న గంటలోపు వాడుకోవాలి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE