డ్రై ఫ్రూట్స్ జాబితాలో అత్యధిక పోషకాలు గలిగిన అక్రోట్ ముందుంటుంది. మెదడు పనితీరును పెంచటానికి ఇదెంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి అక్రోట్ చేసే మేలు గురించి తెలుసుకుందాం.

  • మానసిక ఒత్తిడికి అక్రోట్స్ మంచి ఔషధం. ఆక్రోట్స్ లోని 'మెలటోనిన్' సుఖ నిద్రకు, చక్కని జ్ఞాపకశక్తికి దోహదం చేస్తుంది.
  • ఆక్రోట్స్ లో ఎక్కువగా ఉండే పీచు జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది. ఇందులో లభించే విటమిన్ ఇ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
  • బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన అక్రోట్ రోగనిరోధక శక్తిని పెంచి రోగాలబారిన పడకుండా కాపాడుతుంది.
  • అక్రోట్ వినియోగంతో రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనివల్ల హృదయ రోగాలు నివారించబడతాయి.
  • దీనిలో విరివిగా లభించే ఫాటీ ఆమ్లాలు, ఫైటో న్యూట్రియంట్స్ క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. చికిత్స పొందే రొమ్ము క్యాన్సర్ బాధితులు రోజుకో కప్పు అక్రోట్స్ తినటం వలన క్యాన్సర్ కణాల ఎదుగుదల మందగిస్తుంది.
  • అకోట్స్ లోని ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలను ఆరోగ్యంగా ఉంచటమే గాక చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. రక్త పీడనం కూడా అదుపులో ఉండేలా చూస్తాయి. ఈ ఆమ్లాలు గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని కాపాడటంతో బాటు సరైన సమయంలో ప్రసవం అయ్యేలా చేస్తాయి.
  • రోజూ అక్రోట్ వాడేవారికి ఊబకాయం, జీవక్రియ లోపాలు, రక్తంలోని మోతాదుకు మించి కొవ్వు చేరటం, అధిక రక్త పోటు వంటి ఇబ్బందుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది.
  • రోజూ నాలుగైదు అక్రోట్స్ తినేవారికి పిత్తాశయ రాళ్ళ సమస్య రాదు.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE