మనం తినే అతిపెద్ద ఫలాల్లో పనస ఒకటి. ఆంగ్లలో దీన్ని జాక్ ఫ్రూట్ అంటారు. తూర్పు ఆసియాలో పుట్టిన పనస తన అపురూప ఆరోగ్య గుణాల కారణంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమైంది. వేరే ఏ పండ్లలోనూ లేని వైవిధ్యమైన వాసన, రుచి దీని సొంతం. పనస తొనలు తినటం వాళ్ళ కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

 • తక్కువ గ్లేసేమిక్‌ ఇండెక్స్‌ ఉన్న పనస పండు తిన్నవారికి రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్‌ను నిరోధిస్తుంది.
 • అధిక బరువును, టెన్షన్‌ను త‌గ్గించ‌డంలో ప‌న‌స ప‌నిచేస్తుంది.
 • పనసలోని యాంటీ ఏజింగ్ గుణాలు త్వరగా వృద్ధాప్యం రాకుండా చేస్తాయి.
 • పనస తొనలు జ్వరం, డయారియా రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తాయి.
 • పనస తింటే రక్త నాళాల్లోని అడ్డంకులు తొలగి రక్త సరఫరా మెరుగవుతుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉండి గుండె సమస్యలు రావు.
 • బోలెడంత పీచు లభించే పనస తింటే గ్యాస్ సమస్యలు , అసిడిటీ, మలబద్దకం తొలగిపోతాయి.
 • పనసపండులో కాపర్ థైరాయిడ్ గ్రంథి పనితీరును నిలకడగా ఉంచుతుంది.
 • తరచూ పనస తొనలు తినే పురుషుల్లో లైంగిక పటుత్వం, వీర్యకణాలు వృద్ధి చెంది సంతానం కలిగే అవకాశాలు రెట్టింపవుతాయి.
 • రోజువారీ పనుల నిమిత్తం శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా రోజంతా కాయకష్టం చేసేవారు, కష్టమైన వ్యాయామం చేసే వారు, పిల్లలు పనస తొనలు తింటే ఉత్సాహంగా పనిచేస్తారు.
 • పాలలో కంటే పనస తొనల్లో ఎక్కువ మోతాదులో కాల్షియం ఉంటుంది. తరచూ ఈ తొనలు తింటే తగినంత కాల్షియం లభించి ఎముకలు బలపడతాయి. కీళ్ల నొప్పులు నివారించబడతాయి.
 • పనస తొనలు తినేవారికి నేత్ర సమస్యలు తొలగి కనుచూపు మెరుగు పడుతుంది. శుక్లాలు రావటం ఆలస్యమవుతుంది.
 • పనస తొనల్లో పుష్కలంగా లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల బెడదను తగ్గిస్తాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE