యుద్ధ సమయంలో సైనికులు మాంసాన్ని ఎండబెట్టిన మాంసాన్ని అప్పటికప్పుడు నిప్పుల్లో కాల్చుకొని తినేవారు. అదే కబాబ్ గా మారింది. మారినకాలంతో బాటు రుచులు, అభిరుచులూ మారటంతో ఇప్పుడు దహీ కబాబ్ వంటి పలు శాకాహార కబాబ్ లూ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. భోజనప్రియుల మెప్పుపొందిన దహీ కబాబ్ తయారీ గురించి తెలుసుకుందాం.

కావలసినవి

హంగ్‌కర్డ్ ( పలుచని వస్త్రంలో వడకట్టిన గడ్డపెరుగు) - కప్పున్నర, కొత్తిమీర కట్ట - ఒకటి, ధనియాలు - అరచెంచా, పుట్నాలపిండి - గరిటెడు, బ్రెడ్ (చివరలు తీసేయాలి) - 2 స్లైసులు, చాట్ మసాలా - 15 గ్రా, గసగసాలు - 60 గ్రా, జీలకర్రపొడి - అరచెంచా, యాలకులపొడి - 1/4 చెంచా, ఉప్పు - తగినంత, నెయ్యి - వేయించేందుకు సరిపడా, పచ్చిమిర్చి తరుగు - 2 చెంచాలు, ఉల్లితరుగు- గుప్పెడు, వెనిగర్‌ - చెంచా

తయారీ

 ముందుగా గసగసాలను నీటిలో అర గంట నానబెట్టి, నీళ్లను వార్చుకొని పక్కన బెట్టుకోవాలి. హంగ్‌కర్డ్ ను ఓ గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాలపొడీ, జీలకర్రపొడీ, చాట్‌మసాలా, ఉప్పు, నల్ల ఉప్పు, పచ్చిమిర్చి, పుట్నాలపొడి, బ్రెడ్ స్లైసులు, చాట్ మసాలా, మిర్చి తరుగు, వెనిగర్‌, కొత్తిమీర తరుగూ, యాలకులపొడీ, తగినంత ఉప్పూ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో పట్టీల్లా చేసుకుని నానబెట్టి తీసిన గసగసాల్లో తేలిగ్గా అద్ది కాగుతోన్న నూనెలో వేయించుకోవాలి. దీన్ని ఉల్లిపాయముక్కలు, మిరియాలపొడీ, ఉప్పు వేసిన పెరుగుతో లేదా పుదీనా చట్నీతో వేడి వేడిగా తింటే ఆహా అనాల్సిందే.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE