కూరగాయల్లో వంకాయ రుచి ఎంతో ప్రత్యేకం. సందర్భం ఏదైనా భోజనంలో వంకాయ ఉండాల్సిందే. కూర, వేపుడు, పులుసు.. పేరేదైనా దీని రుచికి ఆహా.. అనాల్సిందే. ఎప్పుడూ వంకాయతో చేసే ఈ రొటీన్ వంటకాలేనా? అనుకొనే వారు ఈ సారి తప్పకుండా వంకాయ పచ్చిపులుసు చేసి రుచి చూడండి. 

కావలసినవి

 పెద్ద వంకాయ-1, ఉల్లి తరుగు-1 కప్పు, చింతపండు-నిమ్మకాయంత, పచ్చిమిర్చి తరుగు-2 చెంచాలు, బెల్లం తరుగు - చెంచాన్నర, కొత్తిమీర తరుగు- అరకప్పు, నీళ్లు- కప్పున్నర, ఉప్పు-రుచికి తగినంత, వెల్లుల్లి రేకలు- 3, కరివేపాకు- చెంచా, తాలింపుకు 3 ఎండుమిర్చి, పావు చెంచా చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, తాలింపుకు సరిపడా నూనె 

తయారీ

ముందుగా నానబెట్టిన చింతపండు పిండి రసం తీయాలి. తర్వాత నూనె రాసిన వంకాయను వేడి బాణలిలో వేసి అటూఇటూ తిప్పుతూ కాల్చుకోవాలి. అవకాశం ఉండి నిప్పులమీద కాల్చుకోగలిగితే మరింత బాగుటుంది. కాల్చిన వంకాయ చల్లారిన తర్వాత తొక్క తీసి గుజ్జును ఒక గిన్నెలో వేసి మెత్తగా నలపాలి. మరో వెడల్పాటి గిన్నెలో వంకాయ గుజ్జు, ఉల్లి తరుగు, మిరపకాయ ముక్కలు, బెల్లం తరుగు, చింతపండు రసం, ఉప్పువేసి కలిపి తగినన్ని నీళ్లు పోయాలి. తర్వాత తాలింపు వేసి చివరగా కొత్తిమీర చల్లి వేడివేడి అన్నం లేదా పులగంలో కలుపుకొని తింటే చాలా బాగుటుంది.Recent Storiesbpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE