• HOME
  • పోషకాహారం
  • క్యాల్షియం లెక్కతప్పితే..ఆరోగ్యానికి ముప్పే

రోజువారీ శారీరక అవసరాలకు కావలసిన క్యాల్షియం ఎంత? పురుషుల కంటే మహిళలు ఎక్కువ క్యాల్షియం తీసుకోవాలా? తగినంత క్యాల్షియం అందకపోతే ఎముకలు గుల్లబారిపోతాయా? క్యాల్షియం మాత్రలు తీసుకొంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా?.. ఇవన్నీ తరచూ వైద్యులకు ఎదురయ్యే ప్రశ్నలు. వేగవంతమైన జీవనం, మారిన ఆహారపుటలవాట్ల కారణంగా ఇప్పుడు క్యాల్షియం లోపంతో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందుకే ఈ అంశం మీద అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. 

మన జీవక్రియల నిర్వహణకు అవసరమైన ప్రధాన పోషకాల్లో క్యాల్షియం ఒకటి. ఎముకలు, దంతాల పుష్టికే గాక అధికరక్తపోటు నివారణకు, చిన్నారుల్లో ఎదుగుదల లోపాల నివారణకు , కండరాల సంకోచ వ్యాకోచాలకు, మహిళల్లో రుతు సమస్యల నివారణకు ఇదెంతో అవసరం. 

లోపిస్తే వచ్చే మార్పులు

శరీర అవసరాలకు సరిపడా క్యాల్షియాన్ని ఆహారం రూపంలో అందించకపోతే శరీరం దాన్ని .. ఎముకల నుంచి తీసుకొని వాడుకొంటుంది. దీంతో ఎముకలు గుల్లబారతాయి. మహిళల్లో ఈ మార్పు మరింత వేగంగా జరుగుతుంది. మహిళల్లో కనిపించే రుతు సమస్యలూ, అకాల మెనోపాజ్ కు క్యాల్షియం లోపం ప్రధాన కారణంగా ఉంది. అందుకే 30 ఏళ్ళ వరకు అందరూ ఎముకలకు పుష్టి కలిగించే ఆహారం తీసుకోవటం, తగినంత వ్యాయామం చేయటం అవసరం.

ఎవరికెంత క్యాల్షియం?

వయసు, లింగభేదం, వృత్తి, జీవనశైలి, శారీరక స్థితి వంటి పలు అంశాలను బట్టి ఓ వ్యక్తికి ఎంత క్యాల్షియం అవసరమో నిర్ణయించగలం. నిపుణుల లెక్క ప్రకారం.. 30-50 ఏళ్ళ మహిళకు రోజుకు 1000 మిల్లీ గ్రాముల వరకు క్యాల్షియం అవసరం. సాధారణ మహిళ కంటే అదే వయసు గర్భిణి లేదా బాలింతకు ఎక్కువ క్యాల్షియం అవసరం. 60 ఏళ్ళు దాటిన మహిళకు సుమారు 1200 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవసరం. ఒకే వయసు స్త్రీ పురుషులకూ వేర్వేరు మొత్తంలో క్యాల్షియం అవసరం ఉంటుంది. చిన్నారుల విషయంలోనూ ఈ తరహా మార్పులు ఉన్నాయి. పాలు, పాల పదార్థాలు విరివిగా వాడనివారు లోపించిన క్యాల్షియాన్ని మాత్రల రూపంలో తీసుకోవాల్సిందే. 

క్యాల్షియం మాత్రలతో కిడ్నీ రాళ్లు.. అపోహే

క్యాల్షియం లోపం ఉన్నవారికి ఆ మాత్రలు వాడాలని వైద్యులు సూచించినా.. కిడ్నీ రాళ్ళ భయంతో వాడటం లేదు. ఇది పూర్తిగా అపోహే. కనుక వైద్యులు సూచించిన విధంగా వారు క్యాల్షియం మాత్రలు వాడొచ్చు. కొందరు ఎడాపెడా ఈ మాత్రలు వాడుతారు. ఇదీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటివారిలో ఎక్కువైన క్యాల్షియం శరీరంలో చేరకుండా పేగు లోపలి పొరపై ఒక పొర ఏర్పడుతుంది. ఒక్కోసాగారి ఇది మలబద్దకానికి కారణమవుతుంది. క్యాల్షియం మాత్రలు వాడేవారు విటమిన్ డి మాత్రలూ వాడటం మంచిది. అయితే.. సమీకృత ఆహారం, ఎండలో పనిచేసేవారికి విటమిన్ డి సహజంగానే లభిస్తుంది గనుక వారు విటమిన్ డి మాత్రలు వాడాల్సిన పనిలేదు.



Recent Stories







bpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE