యశోదమ్మ ఎంత ముద్దుగా గోరుముద్దలు తినిపించినా, ఆ నల్లగోపయ్య మనసంతా భక్తులు ఇష్టంగా సమర్పించే ప్రసాదం మీదే. కృష్ణాష్టమి సందర్భంగా బుడిబుడి నడకలతో భక్తుల ఇంట అడుగు పెట్టే ఆ బాలకృష్ణుడికి ఇష్టమైన బెల్లం ఉండల ప్రసాదం భక్తితో నివేదిద్దాం.

కావలసినవి

బియ్యప్పిండి - గ్లాసు, బెల్లం తురుము - గ్లాసు, పచ్చి కొబ్బరి తురుము - అరకప్పు, నువ్వులు - చెంచా, యాలకుల పొడి - చిటికెడు

తయారీ

ఒక మందమైన పాత్రలో తురిమిన బెల్లంలో తగినన్ని నీళ్లు పోసి సన్నని సెగమీద లేత పాకం వచ్చేవరకు ఉంచాలి. అలాగే మరో స్టౌ మీద కడాయిలో నువ్వులను దోరగా వేయించి పక్కనబెట్టుకొని, అందులోనే పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి రంగుమారి వరకు సన్నని సెగ మీద వేయించాలి. బెల్లం పాకం సిద్ధం కాగానే కొద్దికొద్దిగా వేయించిన నువ్వులు, పచ్చికొబ్బరి, యాలకులపొడి వేసి బాగా కలిపి చివరగా కొద్దికొద్దిగా బియ్యప్పిండి పోసి ఉండలు కట్టకుండా సమంగా కలపాలి. ఈ మిశ్రమం చల్లారగానే అరచేతిలో పట్టేంత తీసుకొని  ఉండలు చేసి కాగుతున్న నెయ్యిలో వేసి వేయించి తీయాలి. నెయ్యి అందుబాటులో లేకపోతే నూనెనూ వాడచ్చు.



Recent Stories







bpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE