మెంతికూర అనగానే పరోటా, పప్పు వంటి వంటకాలు గుర్తుకొస్తాయి. అయితే మెంతికూరతో మరెన్నో వంటకాలూ చేసుకోవచ్చు. అలాంటి వాటిలో మెంతికూర పులావ్ ఒకటి. బోలెడన్ని పోషకాల సమాహారమైన మెంతికూరతో చేసే ఈ వంటకం ఎలా చేయాలో తెలుసుకుందాం. 

కావల్సినవి

మెంతికూర - 2 చిన్న కట్టలు , సన్న బియ్యం - 1 కప్పు, నెయ్యి - రెండు చెంచాలు, జీరా- అరచెంచా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, యాలకులు, బిర్యానీ ఆకులు - 2 చొప్పున, దాల్చిన చెక్క - 2 అంగుళాలు, లవంగాలు - 4, మిరియాలపొడి - అరచెంచా, గరంమసాలా - అరచెంచా, ఉడికిన ఆలూ ముక్కలు - అరకప్పు, ఉప్పు - తగినంత.

తయారీ

ముందుగా మెంతి ఆకును బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో నెయ్యి వేసి వేడిచేసి అందులో జీలకర్ర, బిర్యానీఆకులు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు దోరగా వేయించి అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 5 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఉడికించిన ఆలూ ముక్కలు, కడిగి తరిగి పెట్టుకొన్న మెంతి కూర వేసి కలిపి సన్నని సెగ మీద ఆకు పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆ తరవాత కడిగి వార్చి పెట్టుకొన్న బియ్యాన్ని కూడా ఈ మిశ్రమంలో వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత తగినంత ఉప్పు, గరంమసాలా, మిరియాలపొడి వేసి రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మంట తగ్గించి ఉంచాలి. బియ్యం బాగా ఉడికిన తర్వాత దించి అప్పటికప్పుడు కుర్మాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. బిర్యానీల వంటి వంటకాలతో పోల్చితే ఆరోగ్యానికీ ఇదెంతో మంచిది.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE