భారతీయ భోజనంలో పెరుగు ముఖ్య పదార్ధం. ఇక.. దక్షిణాదిన భోజనం ముగిసేది పెరుగన్నంతోనే. పాల పదార్థాలంటే అయిష్టత, ఎలర్జీ సమస్య, అవగాహన లేమి వంటిఎన్నో కారణాల వల్ల పలువురు పెరుగు తీసుకోరు. అయితే తగిన రీతిలో తీసుకొంటే పెరుగుతో మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని నిపుణులు నిపుణులు చెబుతున్నారు.

ఉపయోగాలు

 • ఎముక పుష్టికి, ఎదుగుదలకు తోడ్పడే క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్ పెరుగులో పుష్క‌లంగా ఉంటాయి. అందుకే రోజూ ఓసారైనా పెరుగు తినేవారిలో ఎముక‌ల ఆరోగ్యం బాగుంటుంది.
 • పెరుగులోని మేలు చేసే బ్యాక్టీరియా ఉదర సమస్యలను దరిజేరనివ్వదు. పెరుగులో పోష‌కాలు శరీరపు రోగ నిరోధక శక్తిని పెంచి రోగాలు రాకుండా చేస్తాయి.
 • పెరుగు ర‌క్త‌పోటుని అదుపు చేస్తుంది. అలాగే ర‌క్త‌నాళాల్లో, శ‌రీరంలో కొవ్వు చేర‌కుండా చూసి గుండెజబ్బులు రాకుండా చేస్తుంది.
 • మొలల సమస్య బాధితులు రోజూ పెరుగన్నంలో అల్లం ముక్కలు జోడించి తింటే మంచి ఫలితం ఉంటుంది.
 • పెరుగులోని ప్రొటీన్స్ పాలలోని ప్రొటీన్స్ కంటే సులభంగా, త్వరగా జీర్ణమవుతాయి. అందుకే జీర్ణశక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధులు పాలకంటే పెరుగు వాడటం మంచిది.
 • మలబద్ధకం బాధితులు పెరుగులో అరచెంచా న‌ల్ల మిరియాల పొడి లేదా వాము కలుపుకుని తింటే సుఖ విరేచనం అవుతుంది.
 • వేసవిలో మజ్జిగ లేదా పెరుగులో చక్కెర కలుపుకుని తీసుకొంటే ఒంట్లో వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది.
 • నోట్లో పొక్కులు ఏర్పడినప్పుడు పెరుగుతో నోరు పుక్కిలిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.
 • అధిక బరువు బాధితులు పెరుగులో కొద్దిగా జీల‌క‌ర్ర‌ కలిపి రోజూ తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
 • వేధించే గ్యాస్‌, అసిడిటీ వదిలిపోవాలంటే కొద్దిగా న‌ల్ల ఉప్పును కప్పు పెరుగులో కలుపుకు తింటే సరి.
 • నీరసంగా ఉంటే చెంచా చక్కెర కలిపినా గరిటెడు పెరుగు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. మూత్రాశ‌య స‌మ‌స్య‌ల బెడదా ఉండదు.
 • చిన్నారులు, గ‌ర్భిణులు పెరుగులో కొద్దిగా ప‌సుపు, అల్లం క‌లిపి తీసుకొంటే తగినంత ఫోలిక్ ఆమ్లం అందుతుంది.
 • పెరుగులో నారింజ రసం కలిపి తింటే త‌గినంత విట‌మిన్ సి లభించి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయ‌లూ దరిజేరవు.
 • 100 గ్రాముల పెరుగు తింటే 59 క్యాలరీలు లభిస్తాయి. ఇక.. నీరు- 89 శాతం, ప్రొటీన్- 5.25 గ్రా, క్రొవ్వు-1.55 గ్రా, ఖనిజలవణాలు- 0.8%, కార్బోహైడ్రేట్స్ - 7.03 గ్రా, కాల్షియం- 149 మి.గ్రా, ఫాస్పరస్- 93 మి.గ్రా, ఐరన్- 0.2 మి.గ్రా, విటమిన్ సి- 1 మి.గ్రా ఉంటాయి.

గమనిక

కఫాన్ని పెంచే గుణం కారణంగా రాత్రి వేళ పెరుగు వాడొద్దని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, అలర్జీ బాధితులూ రాత్రివేళ పెరుగు వాడరాదు. అయితే..ఆరోగ్యవంతులు 2 పూటలా పెరుగు తీసుకోవచ్చు. పగటిపూట చక్కెర లేకుండా, రాత్రిపూట చక్కెర లేదా మిరియాల పొడి కలిపి పెరుగు తినటం మంచిది. గడ్డ పెరుగు తినే బదులు కొద్దిగా నీరు కలిపి పలుచగా చేసి తీసుకొంటే త్వరగా జీర్ణమవుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE