ఆహారపదార్థాల్లో కొన్నింటిని నేరుగా తినేకంటే వేరే వాటితో కలిపి తింటే మరిన్ని పోషకాలు సమకూరటమే గాక ఆరోగ్యానికీ మేలు చేకూరుతుంది. ఈ విషయంలో పోషకాహార నిపుణులు సూచిస్తున్న కొన్ని కీలక అంశాలు.. 

తృణధాన్యాలు, ఉల్లిపాయ

తృణధాన్యాలు(జొన్నలు, రాగులు, సజ్జలు, ఉదాలు, కొర్రలు, అరికెలు, వరిగెలు..వంటివి), మొక్కజొన్న, ముడి బియ్యం, బార్లీ, గోధుమల్లో తగినంత మొత్తంలో ఐరన్‌, జింక్‌ ఉంటాయి. అయితే సల్ఫర్ ఉన్న పదార్థాలతో బాటు వీటిని తీసుకున్నప్పుడే ఈ ధాన్యాల్లోని ఐరన్‌, జింక్‌ వంటివి పూర్తిగా శరీరంలోకి శోషించబడతాయి. అందుకే వీటిని సల్ఫర్ అధికంగా ఉండే ఉల్లిపాయలతో కలిపి తీసుకోవాలి. 

సాల్మన్‌ చేప, పసుపు

గొప్ప పోషకాలున్న సముద్రపు చేప..సాల్మన్. తక్కువ పిండిపదార్థాలు, ఎక్కువ ప్రొటీన్లతో బాటు గుండె ఆరోగ్యానికి కొండంత అండగా నిలిచే ఒమెగా-3 ఫ్యాటి ఆమ్లాలనూ కలిగి ఉంటుంది. అయితే యాంటి-ఇన్‌ఫ్లమేటరీ, గాయాలను నయం చేసే పసుపుతో కలిపి దీన్ని తీసుకున్నప్పుడే ఈ రెండింటి గుణాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. ఈ రెండింటినీ కలిపి వాడటం వల్ల నాడీవ్యవస్థ బలోపేతం, రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌(హెచ్‌డిఎల్‌) పెరుగుదలతో బాటు చెడుకొలెస్ట్రాల్‌ తగ్గటం, క్యాన్సర్‌ బాధితుల్లో కణాల పెరుగుదల నెమ్మదించటం వంటి మార్పులు కలుగుతాయి.

చిక్కుళ్లు, కూరగాయలు

చిక్కుడు గింజల్లో బోలెడన్నిప్రొటీన్స్, తగినంత ఐరన్ ఉంటాయి. ఈ చిక్కుడు గింజలను విటమిన్ సి ఉండే కూరగాయలు, పాలకూర, మొలకలు, బంగాళదుంపలతో కలిపి తీసుకోవాలి. అప్పుడు.. చిక్కుళ్లలోని ఐరన్‌ శోషణకు కూరగాయల్లోని విటమిన్‌-సి సహకరిస్తుంది. దీనివల్ల అధిక బరువు సమస్య దారికొస్తుంది. 

టమోటా, ఆలివ్‌నూనె

విటమిన్‌-సి, లైకోపీన్‌ వంటి యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే టమోటాను విరివిగా వాడేవారికి అకాల వృద్ధాప్య లక్షణాలు, క్యాన్సర్‌, ఆస్టియోపోరొసిస్‌ (బోలు ఎముకల వ్యాధి), క్యాటరాక్ట్‌ వంటి సమస్యలు త్వరగా రావు. అయితే టమోటాలకు ఆలివ్ నూనె జోడిస్తే లైకోపీన్‌ మరింతగా శరీరంలోకి శోషించబడుతుంది. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్‌ పెరిగి గుండె సమస్యలు రావు. మెరుగైన రక్తశుద్ధి జరుగుతుంది. పిత్తాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. కాలేయపు పనితీరూ మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE