శరీరంలోని అధికవేడిని దూరంచేసే ఫలాల్లో కర్బూజ ఒకటి. ఇది ఏడాదిపొడవునా లభిస్తుంది. ధర రీత్యా కూడా అందుబాటులో ఉంటుంది. దీని మొత్తం బరువులో 92 శాతం నీరే. జీవక్రియలకు అవసరమయ్యే ఎన్నో కీలక సూక్ష్మ పోషకాలకు ఈ ఫలం చిరునామా. ఖర్బూజాకు సంబంధించిన మరికొన్ని విశేషాలు, ఉపయోగాలు ...

ఉపయోగాలు

  • మూత్రనాళ సమస్యలను నివారించడంలో ఈ పండుకు సాటి మరొకటి లేదు.
  • కర్బూజ జ్యూస్‌ తాగేవారిలో రక్తంలోని చక్కెరశాతం తగ్గుతుంది. అధిక బరువూ తగ్గుతుంది.
  • కర్బూజా వినియోగం అధిక రక్తపోటు నివారణ, నియంత్రణకు దోహదం చేస్తుంది.
  • ఇందులోని విటమిన్- ఏ, పలురకాల నేత్ర సమస్యలను దూరం చేస్తుంది.
  • మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే గుణం కర్బూజ రసానికి ఉంది.
  • కర్బూజా వినియోగంతో జీర్ణశక్తి మెరుగుపడటంతో బాటు మలబద్ధకం దూరమవుతుంది.
  • ఇందులోని బీ,సీ విటమిన్ల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • దీనిలోని నీరు దాహాన్ని తీర్చటమే గాక మెరుగైన జీవక్రియల నిర్వహణకు దోహదం చేస్తుంది.

 Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE