ఉదయం నిద్రలేవగానే ఓ కప్పు టీ తాగనిదే రోజు మొదలు కాదు. ఇక.. గ్రీన్ టీ అందించే విశేష ప్రయోజనాల సంగతి తెలిసిందే. అయితే చామంతి పూలతోనూ టీ చేయొచ్చని, అది గ్రీన్ టీ కంటే ఎన్నో రకాలుగా మెరుగైనదని మీకు తెలుసా? చామంతి పూల టీ, దాని విశిష్ట గుణాల గురించి నేడే తెలుసుకొందాం. రోజుకో కప్పు సేవిద్దాం. 

చేసే పద్దతి

కప్పు నీళ్ళు, కొద్దిగా టీ పొడి కలిపి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఒక కప్పులో తాజా లేదా ఎండిన చామంతి రేకలు వేసి ముందు కాచిన వేడివేడి టీ ని అందులో పోసి కలిపి 2 నిమిషాల పాటు మూతపెట్టాలి. ఆ తర్వాత దాన్ని మరో కప్పులోకి వడగట్టి కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుంటే..సువాసనతో కూడిన చామంతి టీ రెడీ. 

ఉపయోగాలు

  • నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల కళ్లకింద వాపు, నల్లని వలయాలు ఏర్పడితే చామంతి టీ బ్యాగులని ఫ్రిజ్‌లో ఉంచి మూసిన కనురెప్పలపై ఉంచితే సమస్య దూరమవుతుంది. కంటిమీది ఒత్తిడీ దూరమవుతుంది.
  • చామంతి టీలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల ముప్పును తగ్గిస్తాయి.
  • చామంతి టీ లోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లూ, చర్మగ్రంథుల లోలోపలికి చొచ్చుకునిపోయి లోపలి నుంచి శుభ్రం చేస్తాయి. దీనివల్ల చర్మం తాజాగా మారటమే గాక కాలిన గాయాలు, దోమకాటు దద్దుర్లు కూడా తగ్గుతాయి.
  • భరించలేని తలనొప్పి వేధిస్తుంటే..ఓ కప్పు చామంతి టీ తాగితే తలనొప్పి తగ్గటమే గాక ఒత్తిడి ఎగిరిపోతుంది.
  • నిద్రలేమి బాధితులు రోజుకో కప్పు చామంతి టీ సేవిస్తే సుఖనిద్ర సిద్ధిస్తుంది.
  • మధుమేహులు రోజుకో కప్పు చామంతి టీ తాగితే.. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • రోజుకో కప్పు చామంతి టీ తాగేవారికి గ్యాస్, అజీర్ణం, మలబద్దకం, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యల బెడద తక్కువ.
  • మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన వదిలి పోవాలంటే రోజుకో కప్పు చామంతి టీ తాగాల్సిందే.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE