ఉదయం వేళ ఆలస్యంగా నిద్రలేచి ఆ హడావుడిలో అల్పాహారం తీసుకోవటం మానేస్తుంటాం. పలు కారణాల వల్ల ముఖ్యంగా ఇప్పుడు నూటికి 40 శాతం పిల్లలు ఇలాగే చేస్తున్నారు. అంటే.. ఒకరకంగా గత రాత్రి నుంచి మరునాటి మధ్యాహ్నం వరకు.. అంటే 15 గంటల పాటు ఉపవాసం ఉండటమే. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2 నెలలకు అవసరమైన పోషకాలు లోపించి పిల్లలు రక్తహీనతకు గురవుతారు . ఈ పరిస్థితి క్రమంగా చదువుపట్ల అనాసక్తి, చిరాకుకూ దారితీస్తుంది. 

శక్తి మూలం.. 

మన రోజువారీ దినచర్యను తగినంత శక్తిని అందించేది ఆహారమే. సహజంగా తిన్న ఆహారం 4 గంటల్లోగా జీర్ణం అయిపోతుంది గనుక ప్రతి 4 గంటలకూ ఎదో ఒకటి తగిన పరిమాణంలో తీసుకోవాలి. ఏ కారణం వల్లైనా 6 గంటల వరకు ఏమీ తీసుకోకపోతే శరీరం శక్తి కోల్పోతుంది. దానివల్ల రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాల్సిందే. 

బాల్య, కౌమార దశలోని వారి పెరుగుదల తగినట్లు ఉండాలంటే సరైన, తగినంత అల్పాహారం క్రమం తప్పక తీసుకోవాల్సిందే. అప్పుడే వారి ఎత్తు, బరువు సక్రమంగా ఉంటాయి. లేకుంటే మాత్రం ఎదుగుదల లోపాలు తలెత్తుతాయి. 

పిల్లల మానసిక వికాసానికీ అల్పాహారం ప్రాణం. ఆకలితో బడిబాట పట్టే పిల్లలు చదువుపై ధ్యాస పెట్టలేరు. ఇది వారి ఆలోచనా సామర్థ్యం, గ్రహణశక్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

జపమూ యజ్ఞమే

పరమాత్మను చేరేందుకు సాయపడే సులువైన మార్గాల్లో జపం ముఖ్యమైనది. యోగసాధనలోనూ జపం ఒక ముఖ్యాంశంగా ఉంది. జప 

MORE