కావలసినవి
బియ్యం - 1 కప్పు
పెసరపప్పు-1/2 కప్పు
ఆవాలు, జీలకర్ర, మిరియాలు -1 చెంచా చొప్పున
పచ్చి మిర్చి-2
కరివేపాకు ఒక రెమ్మ
నెయ్యి- 4 చెంచాలు
జీడి పప్పు- 10
పసుపు- చిటికెడు
చేసే విధానం
కుక్కర్లో పెసరపప్పూ, బియ్యం తీసుకుని బాగా కడిగి సరిపడా ఎసరు (4 గ్లాసులు) పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి జీలకర్రా, మిరియాలూ, జీడిపప్పూ వేయించి పొంగలిలో వేసి సన్నని మంటపై ఉంచాలి. తరవాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పూ వేసి కలిపి పైన 2 చెంచాలు నెయ్యి చల్లుకొని కలిపి దించుకోవాలి.