కావలసినవి

అరకిలో బియ్యం, చింతపండు - 150 గ్రాములు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు తగినంత, పచ్చి మిర్చి - 10, అల్లం - 20 గ్రాములు. పోపుకోసం- ఆవాలు - అరచెంచా, ఎండు మిర్చి - 10, పచ్చిసెనగపప్పు - 15 గ్రాములు, పల్లీలు- 30 గ్రాములు, ఇంగువ - చిటికెడు, మెంతిపొడి - చిటికెడు, కరివేపాకు- 3 రెబ్బలు, నూనె - 50 గ్రాములు.

తయారీ 

ఒక గిన్నెలో చింతపండు తీసుకొని అందులో 2 గ్లాసుల నీళ్ళు పోసి, పసుపు, ఉప్పు వేసి ఉడికించి చల్లారిన తరువాత బాగా పిసికి గుజ్జు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. బియ్యం కడిగి తగినంత ఎసరుపోసి సన్నని సెగమీద వండుకొని వెడల్పాటి పళ్లెంలో పోసి చల్లార్చుకోవాలి. తర్వాత అందులో చింతపండు, మిర్చి పేస్టు, ఉప్పు వేసి బాగా కలుపుకొని ప్రక్కన పెట్టుకోవాలి. తరవాత కడాయిలో నూనెపోసి ముందుగా ఆవాలు వేసి కొంచం చిటపట లాడిన తరవాత మిగిలిన పోపుదినుసులు, కరివేప, ఎండు మిరపకాయలు వేసి వేగాక అన్నంలో కలుపుకోవాలి.



Recent Stories







bpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE