దసరా మూడో రోజు అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిస్తుంది. ఈ రోజు కొబ్బరి అన్నాన్ని అమ్మకు నివేదన చేస్తారు. దాని తయారీ వివరాలు.. 

కావలసినవి

బియ్యం-1 కిలో

కొబ్బరి తురుము- 1 కప్పు

ఎండుమిర్చి-2

పచ్చి మిర్చి -4 (తరిగి పెట్టుకోవాలి)

కరివేపాకు-2 రెబ్బలు

తాలింపు గింజలు- 1 చెంచా (ఆవాలు, జీలకర్ర, మినపబడ్డలు, పచ్చి సెనగపప్పు)

నూనె- 1 కప్పు

పసుపు : చిటికెడు

ఉప్పు : తగినంత

 

తయారీ

అన్నం కాస్త పలుకుగా వండి, దానికి తగినంత ఉప్పు పళ్లెంలో పోసి ఆరనివ్వాలి. పొయ్యి మీద మందపాటి మూకుడు పెట్టి అందులో నూనె పోసి కాగాక తాలింపు గింజలు, మిర్చి, కొబ్బరి తురుము, పసుపు వేసి వేగిన తర్వాత కరివేపాకు చిటపటలాడించి చివర్లో అన్నంలో వేసి కలిపితే కొబ్బరి అన్నం సిద్దం.



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE