జ్ఞానికి, స్వచ్ఛతకు సరస్వతీదేవి ప్రతీక. అందుకే శరన్నవరాత్రి వేళ మూలా నక్షత్రం రోజున అమ్మకు తెల్లని ప్రసాద నివేదన చేస్తారు. 

కావల్సినవి

అన్నం- కప్పు,  పెరుగు- కప్పున్నర, ఆవాలు -చెంచా, జీలకర్ర - చెంచా, కరివేపాకు – 2 రెబ్బలు, అల్లం తరుగు - చెంచా, పచ్చిమిర్చి ముక్కలు – 2 చెంచాలు, నెయ్యి – 2 చెంచాలు, కొత్తిమీర- కట్ట, ఉప్పు- తగినంత 

తయారీ

అన్నాన్ని గిన్నెలోకి తీసుకుని పెరుగు వేసి కలపాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఆవాలూ, జీలకర్ర వేయాలి. అవి వేగాక కరివేపాకూ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగు వేసి దింపేయాలి. ఈ తాలింపును పెరుగున్నంలో వేయాలి. తరవాత తగినంత ఉప్పూ, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. కావాలనుకుంటే ఇందులో దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE