దసరా నాల్గవ రోజు అమ్మవారు అన్నపూర్ణ అవతారంలో దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి అల్లం గారెలు నివేదిస్తారు.

కావలసినవి

మినప్పప్పు- 2 కప్పులు, దంచిన అల్లం- 2 చెంచాలు, పచ్చిమిర్చి-4, జీలకర్ర- చెంచా, మిరియాలు- అర చెంచా, ఎండుకొబ్బరి తురుము- చెంచా, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా

తయారీ

ముందుగా మినప్పప్పు నానబెట్టి కడిగి పెట్టుకోవాలి. తర్వాత పై మిగిలిన పదార్థాలన్నీ కలిపి రుబ్బి అందులో నానబెట్టిన మినప్పప్పు వేసి బాగా రుబ్బాలి. నీళ్లు ఎక్కువ పోయకుండా పిండి కాస్త గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా అరచేతిలోకి తీసుకొని గారెలా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE